సింహాచలం బాధితులకు వైయ‌స్ఆర్‌సీపీ అండ‌

మృతుల కుటుంబాల‌కు రెండు లక్షలు అందజేత 

విశాఖ: సింహాచలం గోడ కూలి మరణించిన వారి కుటుంబాలకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా నిలిచింది. వైయ‌స్ఆర్‌సీపీ  తరఫున బాధితులకు రెండు లక్షల పరిహారం ప్రకటించింది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, మజ్జి చిన్న శ్రీను, కేకే రాజు.. రెండు లక్షలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మాట్లాడుతూ..‘చనిపోయిన ప్రతి కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుంది. పార్టీ అధినేత వైయ‌స్ జగన్ ఆదేశాల మేరకు రెండు లక్షల ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు అందించాము. సింహాచలం కొండపై ప్రమాదానికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఎండోమెంట్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలి. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. దేవాలయాలలో ఇలాంటి ఘటనలు జరగడం వల్ల భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే ప్రమాదం జరిగింది. ఐదుగురు మంత్రులతో కమిటీ వేసి ఏడుగురి ప్రాణాలు తీశారు. దేవాలయాలకు వెళ్లలంటేనే భక్తులు భయపడే పరిస్థితులు తీసుకువచ్చారు. కూటమి పాలన తీరుతో భక్తులు భయపడుతున్నారు` అంటూ వ్యాఖ్యలు చేశారు.  

Back to Top