వెల్లటూరు బాధితుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ ఆర్థిక‌ సాయం

ఇళ్లు కోల్పోయిన కుటుంబాల‌కు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు చెక్కుల పంపిణీ

ప‌ల్నాడు: వినుకొండ నియోజ‌క‌వ‌ర్గం వెల్ల‌టూరులో వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరులన్న నెపంతో దుర్మార్గంగా  ఇళ్లను కూల్చివేయ‌డం ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పందించారు. బాధిత కుటుంబాల‌కు అండ‌గా నిలిచి ఆర్థిక‌సాయం చేశారు.  ఇళ్లు, వ్యాపార సముదాయాలు కోల్పోయిన బాధితుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ మంజూరు చేసిన ఆర్థిక‌సాయాన్ని మాజీ ఎమ్మెల్యే బొల్లా  బ్ర‌హ్మానాయుడు చేతుల మీదుగా బుధ‌వారం అంద‌జేశారు.  వారం రోజుల క్రితం బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన బాధితులు మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి తమగోడును విన్నవించుకున్నారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వెంట వెళ్లి జననేతకు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. కూటమి నాయకుల ఆదేశాలతో నిరుపేదలమన్న కనికరం కూడా లేకుండా అధికారులు ఉన్నపళంగా ఇళ్లను కూల్చివేశారని వాపోయారు. బాధితులకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా నిలుస్తుందని మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌ భరోసానిచ్చారు. ఇచ్చిన మాట కోసం ఇవాళ ఆర్థిక సాయం చేయ‌డం ప‌ట్ల బాధితులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు

Back to Top