హాస్టళ్లలో ప్రవేశాన్ని నిషేదిస్తూ చీకటి జీఓ

సమస్యలను వెలుగులోకి తెస్తుంటే సహించలేని సర్కార్

మండిపడ్డ వైయస్ఆర్‌సీపీ నేతలు పానుగంటి చైతన్య, రవిచంద్ర

తాడేపల్లి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ స్టూడెంట్స్ వింగ్ ప్రెసిడెంట్ పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర.

15 నెలల కూటమి పాలనలో అధ్వాన్న స్ధితికి సంక్షేమ హాస్టళ్లు

నరకానికి నకళ్లులా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లు

వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం పరిశీలనలో తేలిన కఠిన వాస్తవాలు

హాస్టళ్లలో వసతుల పరిశీలించకుండా విద్యార్ధి, ప్రజాసంఘాలపై నిషేదం

పారదర్శకతకు పాతరేస్తున్న ప్రభుత్వ విధానాలు

వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నేతల ఆగ్రహం

తాడేపల్లి:  కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో సంక్షోభ హాస్టళ్లుగా మారాయని వైయ‌స్ఆర్‌సీపీ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్రలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్ధుల పరిస్ధితి అత్యంత దయనీయంగా ఉందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టళ్లలో కనీసవసతులు కూడా కరవయ్యాని ఆక్షేపించారు.  తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... విద్యాసంవత్సరం ప్రారంభమైన రెండునెలలు పూర్తికావస్తున్నా విద్యార్ధులకు దుప్పట్లు, దోమతెరలు పంపిణీ చేయకపోవడంతో కటికినేలమీద పడుకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లకు నిధుల విడుదల నిలిచిపోవడంతో సక్రమమైన మెనూ కూడా నిర్వహించలేని స్ధితిలో వసతిగృహ నిర్వాహకులు కుళ్లిన కూరగాయల భోజనమే వడ్డిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతుందని మండిపడ్డారు. ఇంకా విద్యార్ధి విభాగం నేతలు ఏమన్నారంటే...

సమస్యలు చూపితో చీకటి జీవోలతో నిషేధమా ..?:   పానుగంటి చైతన్య, వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు

పిల్లలకు నాణ్యత లేని బ్యాగులు సరఫరా చేయడంతో అవి రెండు నెలలకే పూర్తిగా చినిగిపోయాయి. పలుచోట్ల బాత్రూమ్ లలో ట్యాపులు లేవు, రన్నింగ్ వాటర్ లేకపోవడంతో ఆరుబయటే స్నానం చేయాల్సిన దుస్దితిలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా సాంఘిక సంక్షేమ హాస్టల్ లో పిల్లలతో అన్ని పనులు చేయిస్తున్నారు.  మరికొన్ని సంక్షేమహాస్టళ్ల చుట్టూ డంపింగ్ యార్డులా చెత్త పేరికిపోయింది.  అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మేం ఓ హాస్టల్ లో పరిశీలించినప్పుడు భోజనం సరిపోక పిల్లలు ఆకలితో కేకలు వేస్తుంటే.. వార్డెన్ నిస్సిగ్గుగా హాస్టల్ లోనే మద్యం సేవిస్తూ పట్టుబడ్డాడు. వైయ‌స్ఆర్  కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, నియోజకవర్గ, మండస్దాయిలో ఉన్న సంక్షేమ హాస్టళ్ల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లు అత్యంత అధ్వాన్న స్ధితిలో ఉంటే.. ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన మాపై కక్షపూరితంగా 13 సెక్షన్లతో అక్రమ కేసులు బనాయించారు. సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను ఎత్తిచూపితే వాటిని పరిష్కరించాల్సింది పోయి.. కూటమి ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా.. రాత్రికి రాత్రే చీకటి జీవో విడుదల చేసింది. విద్యాశాఖ మంత్రి నారాలోకేషన్ ను సూటిగా ప్రశ్నిస్తున్నాం? సమస్యలను ఎత్తిచూపితే పరిష్కరించాల్సింది పోయి.. చీకటి జీవోలతో మాపై కేసులు నమోదు చేస్తున్నావ్ ?అక్కడితే ఆగకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫీజు ఫోరు పేరుతో విద్యార్ధులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు బకాయిలపై కాలేజీల్లో ఆందోళన బాట పట్టిన నేపధ్యంలో... అక్కడ కూడా నిషేధం విధిస్తూ మరో చీకటి జీవో విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ కాలేజీలు అన్నీ కూటమి పార్టీ నాయకులవే. మీరు విడుదల చేసిన జీవోలు కాలేజీక యాజమాన్యాలకు మేలు తప్ప, విద్యార్ధులకు ఉపయోగం లేదు. ఈ చీకటి జీవోలను ఉపసంహరించుకోకపోతే... వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం తరపున ఆందోళనను ఉధృతం చేస్తాం.  

నిర్వహణపై దృష్టి సారించకుండా డైవర్షన్:   రవిచంద్ర, వైయ‌స్ఆర్‌సీపీ స్టూడెంట్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్.

రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లలో ప్రభుత్వం కల్పిస్తున్న కనీస సౌకర్యాలను పరిశీలించడానికి వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం తరపున 175 నియోజకవర్గాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్జీ హాస్టళ్లను పరిశీలించాం. జూలై 28 నుంచి 31 వరకు చేపట్టిన ఈ సందర్శనలో అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వీటన్నింటిని మేం ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం తిరిగి మా పై కేసులు నమోదు చేసింది. అక్కడితో ఆగకుండా సంక్షేమవసతి గృహాల్లో విద్యార్థి సంఘాలు, విద్యార్థి నేతలు, రాజకీయ పార్టీలు సందర్శించడానికి వీల్లేదంటూ జీవోలు సైతం విడుదల చేసింది. ఇది దుర్మార్గమైన, అప్రజాస్వామికమైన చర్య. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్జీ సంక్షేమ హాస్టళ్లు సంక్షోభానికి నిలయంగా మారాయి. చంద్రబాబు ప్రభుత్వం 2019 కంటే ముందు పాఠశాల హాస్టల్ విద్యార్ధులకు రూ.850 మెస్ ఛార్జీలు  ఇవ్వగా, కాలేజీ హాస్టల్ విద్యార్ధులకు రూ.1200 ఇవ్వగా.. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పాఠశాల హాస్టల్ విద్యార్ధులకు రూ.1400 పెంచగా, కాలేజీ హాస్టల్ విద్యార్ధులకు రూ.1600 పెంచారు. అలా పెంచడమే కాకుండా ప్రతిరోజూ మెనూ సక్రమంగా అమలయ్యేలా మానిటరింగ్ చేయించారు. అధికారులను, ప్రజాప్రతినిధులను నేరుగా పరిశీలించేలా ఏర్పాటు చేశారు. 
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15 నెలల్లో సంక్షేమ హాస్టళ్లు పరిస్ధితి పారిశుద్ధ్యం నుంచి పిల్లల భోజనం వరకు అత్యంత అధ్వాన్నంగా తయారైంది. సమీక్ష సమావేశాల కోసం కోట్లలో ఖర్చుపెడుతున్న ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ల మీద ఎందుకు వెచ్చించడం లేదు ? విద్యార్ధుల తరపున మేం ప్రశ్నస్తే.. హాస్టళ్లలోకి రావద్దంటూ జారీ చేసిన చీకటి జీవోలు రద్దు చేయాలని డిమండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రభుత్వ తీరుపై పోరాటం తధ్య మని వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్ధి విభాగం నేతలు స్పష్టం చేశారు.

Back to Top