రైతుల ఆందోళ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద్ద‌తు

తూర్పు గోదావ‌రి జిల్లా:  పక్కనే అఖండ గోదావరి ప్రవహిస్తున్నా.. రైతుల‌కు సకాలంలో నీరు ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. రెండో పంట దేవుడెరుగు...కనీసం మొదటి పంట ఆకుమళ్లకు కూడా నీరు ఇవ్వలేని అసమర్థ ఎమ్మెల్యే కార‌ణంగా అన్న‌దాత‌లు అవ‌స్థ‌లు ఎదుర్కొంటున్నారు. కలవచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ లో 2 మోటార్లు తిప్పకుండా, సాగునీరు అందించకుండా రైతులు ఆకలి కేకలకు కారణమైన ప్రభుత్వ, స్థానిక శాసనసభ్యుడు నిరంకుశుత్వ వైఖరికి నిరస‌నగా సీతారామపురం గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేప‌ట్టారు.  సాగు నీటి సాధ‌న‌కు రైతుల చేప‌ట్టిన ఆందోళ‌న‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తుగా నిలిచింది. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మేడా గురుదత్ దీక్ష‌ల‌కు సంఘీభావం ప్ర‌క‌టించారు.

Back to Top