విలువలు నిబద్ధత కలిగిన నాయకుడు వైయస్ జ‌గ‌న్‌

దక్షిణ కొరియాలోని యాన్ డాంగ్ వేదికగా అంతర్జాతీయ సదస్సు 

సదస్సులో పాల్గొన్న నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం 

అంతర్జాతీయ విలువల సదస్సులో పాల్గొనడం హర్షించదగ్గ విషయం 

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, నగర ప్రజలకు ప్రత్యేక అభినందనలు 

వారి సహకారంతోనే నేడు సదస్సుకు హాజరయ్యాను  అని స్పష్టీకరణ 

అనంత‌పురం: విలువలు నిబద్ధత కలిగిన నాయకుడు వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని అనంత‌పురం మేయ‌ర్ మొహమ్మద్ వసీం సలీం పేర్కొన్నారు. దక్షిణ కొరియాలోని యాన్ డాంగ్ వేదికగా జ‌రిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయ‌న గ‌త ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాల‌ను వెల్ల‌డించారు. అనంతపురం నగర మేయర్ దక్షిణ కొరియాలో జరిగిన వరల్డ్ హ్యుమానిస్టిక్ సిటీస్ నెట్వర్క్ జనరల్ అసెంబ్లీ లో భాగస్వాములయ్యారు. దక్షిణ కొరియా లోని యాన్ డాంగ్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ప్రపంచంలోని వివిధ దేశాల, రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ప్రత్యేకంగా మీడియాకు వివరాలను వెల్లడించారు. ప్రధానంగా విలువలతో కూడిన రాజకీయం అంటేనే ప్రధానంగా గుర్తుకు వచ్చే ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు అందించడం ద్వారా తాము అధికారంలోకి వస్తామని సూచనలను చేసిన వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు ప్రజలకు చేయగలిగిన హామీలను మాత్రమే అందించాలని ఎంతో విలువలతో, నిబద్ధతతో వ్యవహరించిన నాయకుడు జగన్ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా తనకు గుర్తొచ్చిన ఏకైక నాయకుడు జగన్ అని ఆయన స్పష్టం చేశారు. తనతో పాటు ఇతర దేశాల, రాష్ట్రాల ప్రతినిధులు ఇందులో పాల్గొని వారి వారి ఆలోచనలను పంచుకున్నారు. నేటి యువత విలువలు, నిబద్ధతను పూర్తిగా విస్మరించారని వారు విలువల అదేవిధంగా నిబద్ధత కూడిన వ్యవహార శైలిని అలవర్చుకోవాలని ఇదే ప్రధాన అజెండాగా ఈ సమావేశం కొనసాగిందని తెలిపారు. ఇలాంటి అంతర్జాతీయ స్థాయి సదస్సులలో భాగస్వామ్యం చేసినందుకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, నగర ప్రజలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.   రాజకీయాలు అందరూ చేస్తారని కానీ విలువలతో కూడిన రాజకీయం చేసి ప్రజలకు చిరస్థాయిగా తన సేవలను అందించాలని ఎంతో నిబద్ధత కలిగిన గొప్ప నాయకుడుగా ఆయన ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. ఆయన స్ఫూర్తితోనే తాము నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించామన్నారు. నేడు తమకు ఈ స్థాయి దక్కినందుకు మాజీ ముఖ్యమంత్రి అందించిన రాజకీయ అవకాశం వల్లే సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నగర ప్రజలకు ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

Back to Top