వైయ‌స్ఆర్‌సీపీ రీజినల్‌ కో–ఆర్డీనేటర్స్‌ నియామకం 

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పలువురిని పార్టీ రీజినల్‌ కో–ఆర్డీనేటర్స్‌గా నియమించారు.  ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు బొత్స సత్యనారాయణ, ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు కురసాల కన్నబాబు,  శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు బూడి ముత్యాలనాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు గుడివాడ అమర్‌నాథ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం జాబితా విడుదల చేసింది. 

Back to Top