ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెడితే చూస్తూ ఊరుకోం..

వైయ‌స్ఆర్‌సీపీ యూత్ వింగ్ స్టేట్ వ‌ర్కింగ్‌ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

అనంత‌పురంలో కోటి సంతకాల సేకరణకు విశేష స్పంద‌న‌

అనంతపురం : ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టాలని చూస్తున్న కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ స్టేట్ వ‌ర్కింగ్‌ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరునకు వ్యతిరేకంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.  ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టి.. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడం ఏంటని ప్రశ్నించారు. డబ్బులు ఉన్న వాళ్లకేనా ఈ ప్రభుత్వం ఉండేది పేద వాళ్ళని పట్టించుకోదా అని, ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో అసహనం వచ్చిందని వైయస్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాలు చేపట్టిన అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేస్తున్నారన్నారు. 

గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైయ‌స్ఆర్‌సీపీ పై కూటమి ప్రభుత్వం విష ప్రచారం చేసింది.. అవన్నీ అబద్ధాలే అని రాష్ట్ర ప్రజలు ఇప్పుడు గ్రహించారు కాబట్టే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై ఎంత తిరుగుబాటు వచ్చినా  వాళ్ల వైఖరి మార్చుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు 4 సంవత్సరాల 364 రోజులు అందని కాటికి దోచుకుని దాచుకోవాలని చూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలకు ఏమాత్రం మేలు చేయాలని ఉద్దేశం లేదన్నారు. రాష్ట్రంలో ఎవరైనా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తే వైసీపీ నాయకుల పై కేసులు పెట్టడం పరిపాటిగా మారిందన్నారు. గడిచిన ఐదేళ్లపాటు వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపై లిక్కర్ స్కాం లిక్కర్ స్కామ్ అంటూ విష ప్రచారం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం లైసెన్స్ డిసెల్లరీల ద్వారా ప్రభుత్వం మద్యం అందిస్తే అక్రమ మద్యం అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతి నియోజకవర్గంలో ఒక డిసిల్లరిని పెట్టి మద్యం తయారుచేసి మద్యం అమ్మి డబ్బు పోగేసుకుంటున్నారన్నారు.

గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం లో వైయ‌స్ జ‌గ‌న్‌ కులం చూడం, మతం చూడం అని పథకాలు అందజేస్తే.. కూటమి ప్రభుత్వం మాత్రం కులం, మతం చూడకుండా బెల్ట్ షాపులు నడుపుతూ.. సాయంత్రానికల్లా డబ్బు ఇస్తే చాలనే ఆలోచనలో టిడిపి నాయకులు ఉన్నారు. కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నాయకుల అరెస్టు చేయడం జరుగుతుందన్నారు. గత వారంలో కాశీబుగ్గల దేవాలయం దగ్గర తొక్కిసలాటలో దాదాపు తొమ్మిది మంది మరణిస్తే.. దాన్ని ప్రజలు ఎవరు ప్రశ్నించకూడదని ఉద్దేశంతోనే.. బీసీ నాయకుడు జోగి రమేష్ ను అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క డైవర్షన్ పాలిటిక్స్ అనే రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందన్నారు. మొన్న తిరుమలలో తొక్కిసలాట జరిగితే దిక్కు లేదు.. నిన్న సింహాచలంలో గోడకూలి ప్రమాదం జరిగితే దిక్కు లేదు.. ఆడపిల్లల పైన అఘాయిత్యాలు జరిగితే దిక్కులేదు.. రైతులకు పంట నష్టం జరిగితే దిక్కులేదు.. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే దిక్కులేదు.. యువతకు నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం ఇవ్వకపోతే దిక్కులేదు.. ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. 

గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో కోవిడ్ లాంటి కష్ట కాలంలో కూడా ఇచ్చిన ప్రతి హామీని కూడా వైయ‌స్ జ‌గ‌న్‌ నెరవేర్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు లక్షల కోట్లు అప్పు చేసిన ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేక పోతున్నారని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలు పూర్తి చేసేందుకు దాదాపు 5వేల కోట్లు మాత్రమే ఖర్చవుతుంది అని, అది ఎందుకు కూటమి  ప్రభుత్వం ఇవ్వలేకపోతుందని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం కేవలం పెత్తందారులు కోసమే ఏర్పాటు అయిందని, ప్రజల కోసం ఏమాత్రం కాదని తెలియజేశారు.  

Back to Top