రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలు జ‌ర‌గాలి

తెలుగు ప్ర‌జ‌ల‌కు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి

తాడేప‌ల్లి:  రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అన్ని శుభాలు జ‌ర‌గాల‌ని మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అకాంక్షించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరాది.. ఉగాది సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి   శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని, విజయాలు సిద్ధించాలని, సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతి సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని శ్రీ వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని శ్రీ వైయస్‌ జగన్‌ తన సందేశంలో అభిలషించారు.

Back to Top