జర్నలిస్ట్ కేవీఆర్‌కు వైయ‌స్ జగన్ భరోసా 

తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిను హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్ట్ కె. వెంకట్రామి రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కలిశారు. సోషల్ మీడియా పోస్టుల విషయంలో అక్రమంగా కేసు నమోదు చేసి, నోటీసుల పేరుతో పిలిపించి కర్నూలు పోలీసులు హింసించారని కేవీఆర్ వివరించారు. కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో ఆయన విడుదలైనట్లు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన జగన్, తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొవాలని భరోసా ఇచ్చారు. అవసరమైన న్యాయ సహాయం వైయ‌స్ఆర్‌సీపీ అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు విధించడం దారుణమని, కొంతమంది పోలీసు అధికారుల వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. జర్నలిస్టులకు వైయ‌స్ఆర్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

 
 

Back to Top