చట్టాన్ని చుట్టంలా మార్చుకున్న కూటమి ప్రభుత్వం

అక్రమ రిమాండ్‌పై మాజీమంత్రి అంబటి రాంబాబు న్యాయపోరాటం

తాడేపల్లి లోని వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.

మూడు కేసుల్లో పోలీసులు నాపై అక్రమ రిమాండ్‌

హైకోర్టు సర్క్యులర్ ని అమలు చేయని పోలీసులు

ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో జైలు శిక్ష కోర్టు ధిక్కారమే

పోలీసుల సమక్షంలోనే నా ఇంటిపై 7 గంటల పాటు కరాళ నృత్యం

చట్టాన్ని ఖూనీ చేస్తున్న కూటమి ప్రభుత్వం

ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

తాడేపల్లి: తనపై పెట్టిన అక్రమ కేసులు, నిబంధనలకు విరుద్ధంగా జరిపిన రిమాండ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు న్యాయపోరాటానికి దిగారు. బుధవారం ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు, ఉన్నత న్యాయస్థాన ఆదేశాలను ధిక్కరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం తాడేపల్లి లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...  అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ మరియు ఇమ్రాన్ ప్రతాప్ గదీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం.. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. అయినా నల్లపాడు, పట్టాభిపురం, సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లలో తనపై పెట్టిన కేసులు ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులేనని... కానీ పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో తనను కోర్టులో ప్రొడ్యూస్ చేసి, 18 రోజులు జైల్లో ఉంచడం ముమ్మాటికీ కోర్టు తీర్పులను ధిక్కరించడమేనని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు జారీ చేసిన సర్క్యులర్‌ కు భిన్నంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను కోరానని... చట్టం మీద, న్యాయస్థానాల మీద గౌరవం పెంచడానికే  పోరాటం చేస్తున్నానని స్పష్టీకరించారు. చంద్రబాబు నాయుడు, హోంమంత్రి డైరెక్షన్‌లో పోలీసులు చట్టాన్ని చుట్టంలా మార్చుకున్నారు. అందుకే న్యాయవ్యవస్థ ద్వారానే వీరికి బుద్ధి చెబుతామని  అంబటి రాంబాబు హెచ్చరించారు.
ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే... 

- కోర్టు తీర్పు ధిక్కారంపై పోరాటం...

ఏపీ హైకోర్టులో ఇవాళ ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు హైకోర్టు రిజిస్ట్రార్ కి ఒక వినతిపత్రం సమర్పించాం. నా మీద మూడు తప్పుడు కేసులు పెట్టి రిమాండ్ కు పంపించారు. 26 ఆఫ్ నల్లపాడు పోలీస్ స్టేషన్, 489 బై 25 పట్టాభిపురం పోలీస్ స్టేషన్, 8 ఆఫ్ 23 సత్తెనపల్లె పోలీస్ స్టేషన్ ఈ మూడు కేసుల్లో నన్ను రిమాండ్ కి పంపించగా... దాని పర్యవసానంగా నేను 18 రోజుల్లో సెంట్రల్ జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇది మోస్ట్ ఇల్లీగల్. దీన్ని ఛాలెంజ్ చేస్తూ నేను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాను. పట్టాభిపురం, నల్లపాడు, సత్తెనపల్లి పోలీసులు ఈ సెక్షన్స్ లో కోర్టులో ప్రొడ్యూసర్ చేయకూడదు. అది చట్టంతో పాటు అనేక తీర్పులు చెబుతున్న అంశం. ఇలాంటి కేసుల్లో కోర్టు చెప్పిన అంశాలు పరిశీలిస్తే... అర్నీస్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ మరియు ఇమ్రాన్ ప్రతాప్ గదీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ ఈ రెండు కేసుల్లోనూ.. ఏడు సంవత్సరాలకు లోబడి శిక్ష పడే కేసుల్లో ఆ ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేయవలిసిన అవసరం లేదు. పోలీసులే పూచీకత్తు తీసుకుని వదిలిపెట్టాలి అని ఈ రెండు కేసులకు సంబంధించిన తీర్పుల్లో చెప్పారు. దీన్ని ఆధారంగా చేసుకుని ఏపీ హైకోర్టు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సర్క్యులర్ జారీ చేశారు. ఈ నేపధ్యంలో నా మీద పెట్టినవన్నీఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులే. అలాంటి కేసుల్లో పోలీసులు ఎట్టి పరిస్ధితుల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం లేకపోయినా ప్రొడ్యూస్ చేశారు. ఇది కోర్టు తీర్పుని ధిక్కరించడమే. హైకోర్టు సర్క్యులర్ కి ఎందుకు పోలీసులు భిన్నంగా వ్యవహించారు? దీనిపై పూర్తి స్ధాయిలో విచారణ చేయవలిసిన బాధ్యత న్యాయస్థానాలకు ఉంటుంది. దానిపై ఏం తీర్పు రానుందో రాబోయే రోజుల్లా చూస్తాం.
పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురై నన్ను ఎక్కువ కాలం జైల్లో ఉంచడానికి చిన్న కేసుల్లో కూడా  అవసరం లేకపోయినా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీన్ని సమాజం, న్యాయనిపుణులు తెలుసుకోవాలనే ఈ న్యాయపోరాటం చేస్తున్నాను. 

- పై కోర్టుల తీర్పుకి భిన్నంగా రిమాండ్...

రెండో అంశానికి వస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పటికీ 7 ఏళ్లు లోపు శిక్ష పడే కేసుల్లో రిమాండ్ కు పంపకూడదు. దురదృష్టవశాత్తూ  పోలీసులు అలా చేసినా గౌరవ న్యాయస్థానం వారు దాన్ని తిరిస్కరించాలి. పూచీకత్తుపై వదిలిపెట్టాలి. కానీ అలా జరగలేదు. జ్యుడీషియల్ మెసిస్ట్రేట్ రిమాండ్ కు పంపించారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. ఇలా జరిగితే ప్రజా స్వామ్యంలో చట్టం మీద విలువ, సుప్రీం కోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులకు, సర్క్యులర్ కి విలువ లేకుండా పోతుందనేది నా ఆవేదన. ఎవరైతే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయకుండా నన్ను రిమాండ్ కి పంపారో.. దాని మీద విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ గారికి వినతి పత్రం సమర్పించాను. నేను దీనిమీ నా పార్టీ లీగల్ సెల్ సహాయసహకారాలతో న్యాయపోరాటం చేయదల్చుకున్నాను. మరొక అంశం నేను చంద్రబాబునాయుడుని తిట్టానని నా మీద కేసు పెట్టి జైలుకు పంపించారు. 

- బాధితుడికి సెంట్రల్ జైల్ - నిందితులుకు స్టేషన్ బెయిల్..

మీడియాలో ప్రత్యక్ష ప్రసారం లో రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగానే నా ఇంటి మీద దాడి చేసి ఇళ్లు, కార్లు ధ్వంసం చేశారు. 307 వరకు వెళ్లారు. విధ్వంసం చేశారు. వాళ్లందరికీ ఈ ప్రభుత్వం నన్ను లాకప్ లో పెట్టిన రోజు ఉదయమే దాడికి పాల్పడ్డవాళ్లందరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఇలాంటి చట్టం రాష్ట్రంలో అమలవుతోంది. నాకు జరిగిన అన్యాయమే మరొకరికి రేపు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ దాడిని ఉపేక్షించేది లేదు. మూడో అంశం 31 రాత్రి 10.20 కి తీసుకెళ్లిన తర్వాత 2.30 కి లాకప్ నుంచి బయటకు తీసుకొచ్చారు. బాత్రూమ్ అందులో ఉండగానే నన్ను కేవలం శారీరకంగా హింసించడానికే తీసుకొచ్చారు. ఇది ప్రజాస్వామ్యంలో చాలా దుర్మార్గమైన చర్య. అధికారంలో 5ఏళ్లు ఉన్న రాజకీయపార్టీ నాయకుడిగా, 40 శాతం ఓట్ షేర్ ఉన్న రాజకీయ పార్టీ నేతగా నాకే ఇలాంటి దారుణం జరిగితే చిన్న చిన్న నేరాలు మోపిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. బేడీలు వేసి రోడ్లు మీద నడిపించారు.

- అక్రమ అరెస్టులపై న్యాయ పోరాటం దిశగా...

నన్ను అరెస్టు చేసి లాకప్ లో వేయడాన్ని తప్పు పట్టను.. కానీ నన్ను శారీరంగా హింసించడానికి ప్రయత్నించారు. నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన రోజు రాత్రే గౌరవ మెజిస్ట్రేట్ గారికి చెప్పాను. కస్టోడియల్ టార్చర్ మీద కూడా న్యాయపోరాటం చేయబోతున్నాను. 
పోలీసులు, రౌడీలు కలిసిపోతే ఏం జరుగుతుందో అదే జరిగింది. న్యాయస్థానాలు స్పందించకపోతే చట్టం మీద గౌరవం పోతుంది. కాబట్టి చట్టం మీద గౌరవం పెంచే విధంగా న్యాయస్థానాల ద్వారా న్యాయం కోసం పోరాటం చేసి సరైన విధానాన్ని ఏర్పాటు చేయాలన్న తాపత్రయంతోనే పనిచేస్తున్నాం.
న్యాయవాదిగా, మాజీ మంత్రిగా, 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న రాజకీయ పార్టీ నేతగా నాకే అన్యాయం జరిగితే వదిలివేయడం సరికాదన్న పట్టుదలతో ఈ న్యాయపోరాటానికి సన్నద్ధమయ్యాను. ఈ పోరాటం ద్వారా జరిగిన విషయాలను సరిదిద్దే విధంగా మంచి తీర్పులు రావాలన్న తాపత్రయంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగానే ఈ న్యాయబద్ధమైన పోరాటాన్ని ఇవాళ ప్రారంభించామని స్పష్టం చేశారు. 

● అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ...

నా ఇంటిపై దాడి చేసిన స్వభావం చూస్తే ఇది చాలా  పెక్యులర్ కేసు. నేను ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది సేపటికే నా ఇంటిపై దాడి చేశారు. అన్ని ఛానెళ్లు లైవ్ లో చూపిస్తుండగానే సాయంత్రం 5 గంటలకు మొదలైన దాడి అర్ధరాత్రి వరకు సాగింది. 7.25 నిమిషాల పాటు నా ఇంటి మీద దాడి కొనసాగుతూనే ఉంది. పోలీసులు చూస్తూనే ఉన్నారు. అంటే పోలీసులు తెలుగుదేశం పార్టీతో కలిసిపోయారు. ఏదో ఆవేశంలో దాడి చేసి వెళ్లిపోయినట్లు వెళ్లిపోలేదు దాదాపు ఏడు గంటల పాటు కరాళ నృత్యం చేశారు. ఇది సరైన చర్యా? పోలీసులు సమక్షంలో దాడి జరిగింది. మనం అడవిలో ఉన్నామా? రాజధాని నడిబొడ్డున ఉన్నామా? పోలీసుల సమక్షంలో దాడి జరుగుతుంటే అడ్డుకోలేని, అరెస్టు చేయని పోలీసులు కూడా ముద్దాయిలే. కానీ దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. 

అదే వైయ‌స్ఆర్‌సీపీ వాళ్లు చిన్న నేరం చేసినా, పెద్ద సెక్షన్లు వేసి రాజమండ్రి, నెల్లూరు, విజయవాడ, గుంటూరు జైలుకు పంపించి నెలల తరబడి జైల్లో ఉంచుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు మత్తు మందు సరఫరా చేసినా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించివేస్తున్నారు. ఇలా చేస్తే చట్టం మీద గౌరవం, పోలీసు అంటే భయం, భక్తి ఉంటుందా? 

ఈ నేపథ్యంలో ఏపీలో లా అండ్ ఆర్డర్, పోలీస్ వ్యవస్థ సెట్ రైట్ కావాల్సిన అవసరం ఉంది. అందుకనే న్యాయవ్యవస్థ ద్వారా పోరాటం చేస్తున్నాం. చట్టబద్ధంగా వ్యవహరించే విధంగా చేస్తాం.. దీనికి కోసం న్యాయపరంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.

అర్నీష్ కుమార్, ప్రతాప్ గదీ కేసుల్లో బీహార్, గుజరాత్ హైకోర్టులు ఇచ్చిన తీర్పులను దేశ వ్యాప్తంగా ఫాలో అవుతున్నారు. దీన్ని ఆధారంగా చేసుకునే అన్ని హైకోర్టులు ఫాలో అవుతున్నాయి. వీటిని ఆధారంగా చేసుకునే హైకోర్టు అందరు మెజిస్ట్రేట్ లకు, పోలీస్ స్టేషన్లకు సర్క్యులర్ జారీ చేసింది. కానీ దాన్ని అతిక్రమిస్తున్నారు, కాబట్టే కోర్టు ధిక్కారం కింద కోర్టునాశ్రయించాం. పోలీసులు పెట్టిన సెక్షన్ల శిక్షాపరిమితిని అనుసరించి బెయిల్ ఇవ్వడం లేదా కోర్టులో ప్రోడ్యూస్ చేయడం జరగాలి. కానీ పోలీసులు అలా చేయడం లేదు. చంద్రబాబు, హోంమంత్రి, డీజీపీ ఆ పనిచేయడం లేదు కాబట్టే న్యాయస్థానాలను ఆశ్రయించామన్నారు. 
కూటమి ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. నిద్ర పోతున్న వారిని నిద్రలేపవచ్చు కానీ, నిద్ర నటిస్తున్న వారి గురించి ఏం మాట్లాడుతామన్నారు. నా ఇంటిపై గంటల తరబడి జరిగిన దాడి కంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ ఏముంటుందని ప్రశ్నించారు. అందుకే ఈ న్యాయపోరాటం చేస్తున్నామని అంబటి రాంబాబు అన్నారు.

Back to Top