తాడేపల్లి: పవిత్ర రంజాన్ మాసాన్ని నియమనిష్టలతో పాటించి ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లిం సోదర సోదరీమణులకు వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హృదయపూర్వక ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ నెలలో ఆధ్యాత్మికత, సేవాభావం, త్యాగం వంటి విలువలను పాటిస్తూ ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ అల్లా ఆశీర్వాదాలు లభించాలని ఆయన ఆకాంక్షించారు. అల్లా దయతో అందరి జీవితాల్లో ఆనందం, శాంతి, ఆయురారోగ్యాలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఈద్ పర్వదినం సోదరభావాన్ని, సామరస్యాన్ని మరింత బలపరచాలని, సమాజంలో ఐక్యతను పెంపొందించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.