విజయనగరం : శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటుండగా, ఆయనను పరామర్శించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, విశాఖ–విజయనగరం జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర , ఉత్తరాంధ్ర ప్రాంత ముఖ్య నాయకులు ఆయన స్వగృహానికి విచ్చేశారు. రాజకీయాల్లో పదవుల కంటే ఆత్మీయ అనుబంధాలే ముఖ్యమని చాటి చెబుతూ, బిజీ షెడ్యూల్ మధ్య కూడా సమయం కేటాయించి పెద్దాయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నేతలు ఆయనకు ధైర్యం చెబుతూ, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నేతల ఆత్మీయత, మద్దతు బొత్స సత్యనారాయణకు మరింత బలాన్నిచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పరామర్శ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, వరుదు కళ్యాణి, కల్పలతా రెడ్డి, పాలవలస విక్రాంత్, డా. పెనుమత్స సురేష్ బాబు, కేఆర్‌జే భరత్, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ యాదవ్, కుంభా రవిబాబు, తూమాటి మాధవరావు, మొండితోక అరుణ్ కుమార్, బొమ్మి ఇజ్రాయెల్ పాల్గొన్నారు. అదే విధంగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ పూడి శ్రీహరి, ఇతర రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతీ నాయకుడికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.