ఎస్సీల ఆత్మగౌరవమే వైయ‌స్ఆర్‌సీపీ లక్ష్యం.. 

శింగనమల సమావేశంలో మాజీ మంత్రి సాకె శైల‌జ‌నాథ్ స్ప‌ష్టం

అనంతపురం జిల్లా : రాష్ట్రంలో ఎస్సీ కుటుంబాల ఆత్మగౌరవాన్ని కాపాడే పాలన అవసరమని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. శింగనమల నియోజకవర్గంలో నిర్వహించిన ఎస్సీల విస్తృత సాయి సమావేశంలో మాజీ మంత్రి సాకే శైలజనాథ్, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనకారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాకే శైలజనాథ్ మాట్లాడుతూ, ప్రతి ఎస్సీ కుటుంబం ఆత్మగౌరవంతో జీవించాలంటే అది వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పాలన ద్వారానే సాధ్యమని అన్నారు. ఎవరూ ఆత్మాభిమానం కోల్పోకుండా, గౌరవంగా జీవించాలనే పిలుపునిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులతో ఎస్సీలు ఆర్థిక, రాజకీయ రంగాల్లో ముందుకు రావాలని కోరారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎస్సీలను ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూస్తోందని విమర్శించారు.

గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో దాదాపు 52 లక్షల ఎస్సీ కుటుంబాలు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధిపై అప్పటి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి దీనితో అర్థమవుతుందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎస్సీ కుటుంబాలను ఆదుకునే చర్యలు కనిపించడం లేదని, ఏడు గుర్రాలపల్లి ఘటనపై ఇప్పటికీ స్పందన లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎవరి పాలనలో తమ కుటుంబాలు అభివృద్ధి చెందాయో ప్రతి దళితుడు గుర్తించుకోవాలని, తమ భవిష్యత్తు కోసం సరైన నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంత్రి ఆంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చాములూరు రాజగోపాల్, కల్లూరు ప్రసాద్, మిద్దెకుల్లాయప్ప, జెడ్పీ వైస్ చైర్మన్ నాగరత్నమ్మ, సర్పంచులు పార్వతమ్మ, రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి ఆక్టివిటీ విష్ణు నారాయణతో పాటు ఎస్సీ సెల్ మండల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Back to Top