పల్నాడు జిల్లా: దళిత మహిళ కొనతం స్వాతికి న్యాయం చేయాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు శనివారం సత్తెనపల్లి తాలూకా సెంటర్ లోని డాక్టర్ బిఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్వక్తం చేశారు. ఈ సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి చిలకా జయపాల్ మాట్లాడుతూ, ఓ దళిత మహిళను అసభ్య పదజాలాలతో, కులం పేరుతో దూషించిన జనసేన నాయకుడు రంగశెట్టి సుమన్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. దళిత మహిళ స్వాతికి న్యాయం జరిగేంత వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతామని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ కార్యదర్శి కోడి రెక్క దేవదాసు అన్నారు. దళిత మహిళ అయినా తనను అసభ్య పదజాలాలతో కులం పేరుతో దూషించిన రంగశెట్టి సుమన్ ను శిక్షించాలని, న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు సహారా మౌలాలి, మున్సిపల్ మాజీ చైర్మన్ చలంచర్ల లక్ష్మీ తులసి సాంబశివరావు, ముప్పాళ్ళ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు చావా రమేష్, రాజుపాలెం మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బోదాటి సీతారాములు, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గుజ్జర్లపూడి కృపావరం, పల్నాడు జిల్లా యూత్ సెక్రెటరీ యాసారపు బాబు, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు డానియల్, మాజీ కౌన్సిలర్ గుజ్జర్లపూడి సతీష్,సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ జలీల్, పల్నాడు జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు సయ్యద్ ఘోర, జంగాల సంపత్, గుజ్జర్లపూడి నిరంజన్ ప్రకాష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.