టీడీపీ నాయ‌కుల వేధింపుల‌కు ద‌ళితుడు ఆత్మ‌హ‌త్య‌

బాధిత కుటుంబానికి మాజీ మంత్రి తానేటి వ‌నిత ప‌రామ‌ర్శ‌

ప‌శ్చిమ గోదావ‌రి:  టీడీపీ నేత‌ల అరాచ‌కాల‌కు అంతే లేకుండా పోయింది. గోపాలపురం నియోజకవర్గం దూబచర్ల గ్రామంలో టిడిపి నాయకుల వేధింపులకు దళితుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. 32 సంవత్సరాలుగా చిల్లర కొట్టు మీద దొబ్బేటి పెద్దిరాజు,రాణి దంపుతులు జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ చిల్లర కొట్టు తొలగించాలని టిడిపి నాయకుల ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శి అలేఖ్య.. దౌర్జన్యానికి దిగారు. టీడీపి నాయ‌కులు నాయుడు గంగాధర్, ఈడే శ్రీను కొట్టు ఖాళీ చేయాలని  లేనిపక్షంలో కూల్చివేస్తామ‌ని  బెదిరింపులకు దిగారు. టీడీపి నాయకులు తో పాటు గ్రామ సెక్రెటరీ అలేఖ్య దుర్భాషలాడడంతో మనస్థాపం చెందిన పెద్దిరాజు...విలేజ్ సెక్రటరీ , పోలీసులు, టిడిపి నాయకుల సమక్షంలోనే   పురుగుల మందు తాగారు. హటాహుటిన నల్లజర్ల  హాస్పిటల్ కి తరలించ‌గా ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్ కి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా కోలుకోలేక ఇవాళ ఉద‌యం పెద్దిరాజు మ‌ర‌ణించాడు. విష‌యం  తెలుసుకున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి తానేటి వ‌నిత బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు.   

Back to Top