తిరుపతి: ప్రముఖ వ్యాపారవేత్త, సీనియర్ రాజకీయ నాయకులు యాలమూరు శ్రీనివాసులు రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో శ్రీనివాసులురెడ్డి వైయస్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ.. “ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో తిరుపతిలో అభివృద్ధి కుంటుపడింది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదు. తిరుపతిని ముందుకు తీసుకెళ్లగల నమ్మకమైన నాయకత్వం భూమన కుటుంబమేనని విశ్వసిస్తున్నాను. ప్రజల శ్రేయస్సు కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాను. ప్రజల సంతోషం, సంక్షేమం కోసం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు తన వంతు కృషి చేస్తాను” అని శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు.