చంద్రబాబు ఎంపీల మద్దతుతోనే వక్ఫ్ బిల్లు 

 వైయ‌స్ జగన్ భాయ్ హమారా అని గుర్తుపెట్టుకోండి

ముస్లింల ర్యాలీలో మాజీ ఎంపీ మార్గాని భరత్

రాజమహేంద్రవరం : కేంద్రంలో  బిజెపి  ప్రభుత్వం మైనార్టీలో  ఉన్నప్పటికీ  లోక్ సభలో వక్ఫ్ బిల్లు పాసయిందంటే అందుకు చంద్రబాబు కారణమని మాజీ ఎంపీ,  వై.య‌స్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ విమర్శించారు.  టిడిపి ఎంపీల మద్దతు ఇవ్వడం వల్లనే వక్ఫ్ బిల్లు పాసయిందని ఆయన అన్నారు. వక్ఫ్ చట్టం -2025రద్దు కోరుతూ ఐక్య ముస్లిం ర్యాలీ హబీబుల్లా ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. పెద్దఎత్తున ముస్లిం సోదరులు, ముస్లిం మహిళలు పాల్గొన్న ఈ  ర్యాలీలో వక్ఫ్ చట్టం 2025రద్దు చేయాలని నినదించారు. మద్దతుగా ర్యాలీలో  పాల్గొన్న భరత్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు నారా హమారా అని నమ్మబలికి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు మరోసారి ముస్లింలను మోసం చేసారని భరత్ విమర్సించారు. అమ్మవడి ఇస్తానని ఇవ్వలేదని, ఇప్పుడు వక్ఫ్ బిల్లుకి లోక్ సభలో మద్దతు పలికి బిల్లు పాసవ్వడానికి కారణం అయ్యాడని ఆయన విమర్శించారు.  అసలు టీడీపీ మద్దతు లేకపోతె కేంద్రంలో ప్రభుత్వమే పడిపోతుందని, అలాంటిది బిల్లు పాసవ్వడానికి దోహద పడ్డ చంద్రబాబు నైజాన్ని ప్రతి ముస్లిం గుర్తు పెట్టుకోవాలని భరత్ అన్నారు. పార్లమెంట్ లో ఈ బిల్లుకి వ్యతిరేకంగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఓటు వేసిన విషయాన్ని ముస్లింలంతా గుర్తుపెట్టుకోవాలన్నారు. వైయ‌స్ జగన్ బాయ్ హమారా అని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ బిల్లు వలన ముస్లిం లు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్ధం చేసుకుని వైయ‌స్ఆర్‌సీపీ తరపున మద్దతు తెలుపుతున్నామని భరత్ పేర్కొన్నారు.  అనంత‌రం జాంపేట ఆజాద్ చౌక్ దగ్గర మార్గాని భరత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని భరత్ ప్రారంభించారు. మజ్జిగ పంపిణీ చేశారు.  

Back to Top