కుట్టుమిషన్ శిక్షణ ముసుగులో భారీ అవినీతి

తొలి విడతలో రూ.157 కోట్లు స్వాహాకు యత్నం

మొత్తంగా రూ.254 కోట్ల దోపిడీకి కుట్ర

వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ, వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి

బాబు ష్యూరిటీ... అవినీతి గ్యారెంటీగా పాలన

శిక్షణకు ప్రభుత్వ సంస్థలను కావాలనే పక్కకు పెట్టారు 

అనుకూల వ్యక్తులకు అధిక రేట్లకు టెండర్లు అప్పగింత

ఈ స్కామ్‌పై ఏసీబీతో విచారణ జరపాలి

ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్

తాడేపల్లి: రాష్ట్రంలో మహిళలకు వృత్తినైపూణ్యాలను అందించే కార్యక్రమాలను కూడా అవినీతి కల్పతరువులుగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బీసీ, ఓబీసీ, కాపుమహిళలకు కుట్టుశిక్షణ, మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఏకంగా తొలి విడతలో రూ.157 కోట్లు దోచుకునేందుకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ శిక్షణ సంస్థలను కాదని, కూటమి నేతలు తమకు అనుకూలమైన వ్యక్తులకు నిబంధనలకు విరుద్దంగా టెండర్లను కట్టబెట్టారని ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా మహిళలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారి కోసం కేటాయించిన సొమ్మును సైతం కాజేస్తోందని ధ్వజమెత్తారు. 

ఇంకా ఆమె ఏమన్నారంటే...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దోచుకో.. తినుకో..పంచుకో అనే లక్ష్యంతో పనిచేస్తోంది. రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది మహిళలు ఉన్నారు. వారికి ఎన్నికల హమీల్లో ఇచ్చిన వాటిని ఏ ఒక్కటీ నేటికీ అమలు చేయడం లేదు. ఈ రోజు తల్లికివందనం, మహాశక్తి, ఉచిత బస్సు, కళ్యాణమస్తు, పండుగ కానుకలు వంటి స్కీంలు ఎక్కడా అమలు చేయడం లేదు. ఇప్పుడు మహిళలకు కుట్టుమిషన్లు, శిక్షణ కోసం నిర్ధేశించిన స్కీంలోనూ అవినీతికి పాల్పడ్డారు. మొదటి విడతలో రూ.157 కోట్లు దోపిడీకి ప్లాన్ చేశారు. మొత్తంగా రూ. 254 కోట్లను యాబై రోజుల్లో దోచుకునేందుకు సిద్దమయ్యారు. కుట్టుమిషన్ ట్రైనింగ్ అంటూ కుంభకోణంకు పాల్పడ్డారు. మహిళలకు ఇచ్చే కుట్టుమిషన్లు, దాని శిక్షణ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున దోచుకునేందుకు సిద్దపడ్డారు. ఒక మహిళ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో ఈ అవినీతి జరగడం దారుణం. మొదట్లో లక్ష మంది మహిళలకు శిక్షణ ఇస్తామని చెప్పారు. యాబై రోజుల్లో ఏకంగా రూ.157 కోట్ల స్కామ్‌కు తెర లేపారు. రెండు రోజులుగా రాష్ట్రం లోని మహిళలు గగ్గోలు పెడుతున్నారు.అయినా రాష్ట్రప్రభుత్వంలోని పెద్దలు నోరు మెదపడం లేదు. కుట్టుమిషన్, శిక్షణ కార్యక్రమాన్ని మహిళా దినోత్సవం నాడు సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 

లక్షమంది మహిళలను దగా చేస్తున్నారు

బీసీ, ఈబీసీ, కాపు మహిళలు లక్ష మందికి కుట్టుశిక్షణ ఇవ్వాలని ప్రారంభించిన ఈ పథకాన్ని అవినీతికి అడ్డాగా మార్చేశారు. కుట్టుమిషన్‌, శిక్షణకు కలిపి సుమారుగా ఒక్కో మహిళకు వెచ్చించే వ్యయం సుమారు రూ. 7,300 అవుతుంది. కానీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.23వేల రూపాయలు అవుతుందని అంచనా వేసింది. దీనిలో ఒక్కొక్కరి పేరుమీద దాదాపు రూ.15,700 అవినీతికి పాల్పడుతున్నారు. ఇంత ఎక్కువ మొత్తాలకు ఎలా కేటయింపులు చేశారు. మొదటి విడతలో రూ.157 కోట్లు దోచుకునే ప్రయత్నం చేశారు. టెండర్ నిబంధనల ప్రకారం శిక్షణ ప్రారంభమైన పదిహేను రోజులకు 33 శాతం, ముప్పై రోజుల తరువాత మరో 33 శాతం, యాబై రోజుల తరువాత మిగిలిన 34 శాతం విడుదల చేయాలి. కానీ ఈ కాంట్రాక్టర్‌కు మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల కిందనే ఏకంగా రూ.25 కోట్లు విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేందుకు ఎలా ప్రయత్నిస్తున్నారో అర్థమవుతోంది. ఒక్కో లబ్ధదారుకు నలబై అయిదు రోజులకు గానూ 360 గంటలు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. అయితే వీరు మాత్రం 135 గంటలు మాత్రమే శిక్షణ ఇచ్చారు. కనీసం ట్రైనింగ్ కిట్ కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ సంస్థలు, సీడాప్, ఏపీఐటీసీఓ, డీడీయుజీకేవై వంటి సంస్థలు ఉన్నాయి. వాటిని వదిలేసి టెండర్లు పిలిచారు. ఎల్‌1కు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎల్‌2, ఎల్3 లకు 93 శాతం పనులను కట్టబెట్టారు. వారు కూడా టీడీపీ ప్రజాప్రతినిధులు, వారి బినామీలే. ఈ కుంభకోణంపై ఏసీబీ కేసు పెట్టాలి.   

ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్... నేడు సూపర్ స్కామ్స్‌

కూటమి ప్రభుత్వం అప్పుల్లో ఒకవైపు, మరోవైపు అవినీతిలో రికార్డ్‌ సృష్టిస్తున్నారు. అక్షరక్రమంలోనే కాదు అవినీతిలోనూ ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలబెట్టారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అన్నారు, నేడు సూపర్ స్కామ్ లను ప్రజలకు పరిచయం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు బాబు ష్యూరిటీ... భవిష్యత్ గ్యారెటీ అన్నారు. ఈ రోజు బాబు ష్యూరిటీ... అవినీతి గ్యారెంటీ అనే విధంగా పాలన సాగుతోంది. తెలుగుదేశం కాస్తా తెలుగు దోపిడీగా మారింది. గతంలో వైయస్ జగన్ ప్రభుత్వంలో స్కీమ్‌ ఆంధ్రాగా ఉంటే, నేడు కూటమి పాలనలో స్కామ్ ఆంధ్రాగా మారింది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని నారా దోపిడీ అలయెన్స్‌ పాలనగా సాగిస్తున్నారు. గత వైయస్ జగన్ పాలనలో బీసీ మహిళలకు ఆసరా, చేయూత, సున్నావడ్డీ, అమ్మ ఒడి, మహిళలకు ఇళ్ల పట్లాలు, పక్కాగృహాల, పెళ్లి కానుక ఇలాంటి అనేక పథకాలను ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీటన్నింటినీ తొలగించారు. ఇప్పుడు ఇస్తున్న కుట్టుమిషన్ శిక్షణలోనూ అవినీతికి పాల్పడ్డారు. గతంలో కాపునేస్తం కింద కాపు సామాజికవర్గ మహిళలకు తోడ్పాట్టును అందించారు. కూటమి అధికారంలోకి రాగానే ఆ పథకాన్ని రద్దు చేశారు. కాపు మహిళలకు ఇచ్చే జీవనోపాధి వృత్తి శిక్షణ కార్యక్రమాల్లోనూ అవినీతికి పాల్పడుతున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక, మట్టి, మద్యం, ఉర్సా భూములు, అమరావతి టెండర్లు, కాంట్రాక్ట్ పనులు, గోకులాల నిర్మాణం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లోనూ కుంభకోణాలు బయటకువచ్చాయి.

Back to Top