హిందూపురంలో వైయ‌స్ఆర్‌ స్మారక స్థూపం పునఃనిర్మాణం

మున్సిప‌ల్ అధికారులు తొల‌గించిన స్మారక స్థూపం యథాస్థానంలో ప్ర‌తిష్ట

వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ దీపిక ఆధ్వ‌ర్యంలో పార్టీ జెండా ఆవిష్క‌ర‌ణ‌

శ్రీ స‌త్య‌సాయి జిల్లా: హిందూపురం మున్సిపల్‌ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ, పట్టణంలోని రెహమత్‌పురం సర్కిల్లో ఉన్న మ‌హానేత దివంగత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి స్మారక స్థూపాన్ని శనివారం రాత్రి తొలగించారు. సెంట్రల్‌ లైటింగ్‌ పేరుతో ఈ చర్యకు ఒడిగట్టారు. దీంతో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల తీవ్ర నిరసన వ్య‌క్తం చేశారు. ఇవాళ వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దీపిక నేతృత్వంలో అదే ప్రాంతంలో నూతనంగా దిమ్మెను ఏర్పాటు చేయించి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేశారు.  కార్యక్రమంలో  వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కుడు గుడ్డంపల్లి వేణు రెడ్డి , వైస్ చైర్మన్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జులు, మండల కన్వీనర్లు, పార్టీ అనుబంధ విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .

Back to Top