విజయనగరం: అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని విజయనగరం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రాష్ట్రంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను వైయస్ఆర్‌సీపీ నాయకులు పరిశీలించి, రైతులకు ధైర్యం చెప్పారు. చీపురుపల్లి మండలం, పాలవలస గ్రామంలో ఇటీవల వర్షాల వల్లన దెబ్బతిన అరటి తోటలను జిల్లా పార్టీ అధ్యక్షడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షులు వరహాల నాయుడు, జిల్లా ప్రచార విభాగ అధ్యక్షులు వాలిరెడ్డి శ్రీనివాసరావు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంత్, తదితరులు సందర్శించి, రైతులతో మాట్లాడారు. తిరువూరులో తడిసిన ధాన్యం పరిశీలన పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశాల మేరకు తిరువూరు నియోజకవర్గంలో అకాల వర్షాలకు తడిచిన ధాన్యం రాశులను వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామి దాస్, పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామిదాస్ మాట్లాడుతూ..ఆరుగాలం కష్టించి పండించిన పంట ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేశారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఏకష్టం వచ్చినా వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకున్నారని గుర్తుచేశారు. కూటమి సర్కార్ వచ్చాక రైతులకు ఎలాంటి సాయం అందడం లేదన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అనేక గ్రామాల్లో వరి ధాన్యం రాశులు దర్శనమిస్తున్నాయన్నారు. వివిధ గ్రామాల్లో కూటమి నాయకుల కనుసన్నల్లోనే గోనె సంచులు పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి నాయకుల గ్రామాల్లో పెత్తందారి పాలన విధానాన్ని ఖండిస్తున్నామన్నారు. వెంటనే అధికారులు రైతుల వద్ద ధాన్యం కొనుగోలు సేకరణ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. రంగుమారిన ధాన్యం కొనుగోలు చేయాలి: అకాల వర్షాల కారణంగా తడిసి రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వైయస్ఆర్‌సీపీ ఉండి నియోజకవర్గం సమన్వయకర్త పీవీఎల్ నరసింహారాజు డిమాండ్ చేశారు. మంగళవారం నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను, తడిసిన ధాన్యం రాశులను వైయస్ఆర్‌సీపీ నాయకులు పరిశీలించారు. ప్రభుత్వమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.