

















కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి డిమాండ్
నెల్లూరు: వైయస్ఆర్‌సీపీ కార్యకర్త రఫీని చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. వైయస్ఆర్‌సీపీ కార్యకర్త రఫీ హత్య ఘటనపై ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించారు. పోలినాయుడు చెరువులో వైయస్ఆర్‌సీపీ కార్యకర్త షేక్ రఫీని అతి కిరాతకంగా చంపేశారని ఆందోళన వ్యక్తం చేశారు. రఫీ హత్య వ్యవహారం మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారి కుటుంబానికి ఏదైనా సహాయం అందేలా చేస్తామన్నారు. రఫీని హత్య చేసిన రహంతుల్లా, ఆరిఫ్, ఖాదర్ బాషా, ఆసిన్ , మస్తాన్ వలి లను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.