జ‌గ‌న‌న్న‌కు హ‌నుమంతుడిని

తుది శ్వాస వ‌ర‌కు వైయ‌స్ జ‌గ‌న్ వెంటే

మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్ రెడ్డి స్ప‌ష్టీక‌ర‌ణ‌

తిరుప‌తి:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శ్రీ‌రాముడు అయితే..నేను హ‌నుమంతుడ్ని అని శ్రీ‌కాళ‌హ‌స్తి మాజీ ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి అభివ‌ర్ణించారు. తాను పార్టీ మారుతున్న‌ట్లు ఎల్లో గ్యాంగ్‌ చేస్తున్న విష ప్రచారాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. రోజుకో నాయ‌కుడితో త‌న‌పై విష ప్ర‌చారం చేయిస్తున్నార‌ని ఫైర్ అయ్యారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. `తుది శ్వాస విడిచే వరకు వైయ‌స్ జ‌గ‌న్ వెన్నంటి ఉంటా. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేసిన మొట్ట మొదటి వ్యక్తి ను నేను. నాకు జగనన్న కు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. నా పై బురద చల్లే ముందు, మీరు ఇచ్చిన ఉచిత హామీలను అమలు చేయండి. రాష్ట్రంలో ఎక్కడ జరగని అరాచకాలు, అక్రమాలు, భూ దందాలు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం పాలనలో ప్రజలు 10 నెలలకే  విరక్తి చెందారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాక్షస పాలన నడుస్తోంది, ప్రశ్నించే  జర్నలిస్టు లు పైన, ప్రజలు పైన  దాడులు జరుగుతున్నాయి. వచ్చే  స్థానిక సంస్థలు ఎన్నికల్లోనే  శ్రీకాళహస్తి నియోజకవర్గం లో కూట‌మి పార్టీల‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు` అంటూ మ‌ధుసూద‌న్‌రెడ్డి హెచ్చ‌రించారు.

Back to Top