ప్ర‌జాధ‌నానికి జ‌వాబు చెప్పాల్సింది ఆయ‌నే

ట్విట్టర్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

అమ‌రావ‌తిః రాజకీయ నేతలెవరైనా గెలిచినా,ఓడినా ప్రజల మధ్య ఉండాలనుకుంటార‌ని.. చంద్రబాబు మాత్రం కాలు బయటపెట్టడానికి జంకుతున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. ప్రజలిచ్చిన దిమ్మ తిరిగే షాక్‌ నుంచి తేరుకోలేదో? లేక వాళ్ల మీద అలిగారో లింగమనేని ఎస్టేట్‌ ఉంటుందో..? పోతుందోన్న కొత్త టెన్షన్‌ మొదలైంది ఆయ‌న‌కు అంటూ ట్విట్ చేశారు.  ఆ రేకుల షెడ్డు ఒక హాస్పిటలో, బస్టాండో అయినట్టు బాబు గారి డ్రామా ఆర్టిస్టులు టీవీల ముందు ఆవేశపూరిత డైలాగులేస్తున్నారు. కిరాయి తీసుకున్నామనే సంగతి పక్కకు పెట్టి దానికి రూ.9 కోట్లు పెట్టారంటే ఎలా నమ్మాలయ్యా అని చంద్రబాబును ప్రశ్నించండి. ప్రజాధనానికి జవాబు చెప్పాల్సింది ఆయనేన‌ని ట్విట్ చేశారు.
ప్ర‌జా వేదిక‌ను హెరిటేజ్ కంపెనీ డ‌బ్బుతో క‌ట్టారా లోకేశ్‌..
ప్రజావేదిక అనే రేకుల షెడ్డును హెరిటేజ్ కంపెనీ డబ్బుతో ఏమైనా కట్టారా లోకేశ్. మీరు, మీ ముఠా సభ్యులు తెగ ఆవేశ పడుతున్నారు. రూ.50 లక్షల విలువ చేయని తాత్కాలిక నిర్మాణానికి రూ.9 కోట్లు దోచుకు తిన్నది బయట పడిందనా ఏడుపులు? కిరాయి మనుషులతో పరామర్శలు, విషాద ఆలాపనలు ఏందయ్యా? అంటూ ట్విట్ చేశారు.
డ్రామా కాక‌పోతే మ‌రేమిటి?
ఎవరు సలహ‌ ఇచ్చారో కాని తనను ఓదార్చేందుకు రోజుకు 300 మందిని రప్పించుకుంటున్నారు బాబు. వచ్చిన వాళ్లు బాగా రిహార్సల్ చేసి యాక్షన్ ఇరగదీస్తున్నారు. దేశంలోనే సంపన్నుడైన రాజకీయ నేతను, ఇల్లు లేకపోతే మా ఇంటి కొచ్చి ఉండండయ్యా అనడం డ్రామా కాకపోతే మరేమిటి? అంటూ ట్విట్ట‌ర్‌లో ప్ర‌శ్నించారు

Back to Top