పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని అభివృద్ధి చేయండి

వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

ఢిల్లీ: నెల్లూరులోని పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని గాంధీ హెరిటేజ్‌ సైడ్స్‌ మిషన్‌లో చేర్చాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. పినాకిని ఆశ్రమాన్ని మహాత్మాగాంధీ 1921లో నెలకొల్పారని, మహాత్ముని 151వ జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈ ఆశ్రమాన్ని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని సంస్కృతిక శాఖ మంత్రిని కోరారు. పరికరాల కోసం రూ. 2.8 కోట్లు, ఏటా ఖర్చుల కోసం రూ. 14 లక్షలు కేటాయించాలన్నారు.

Back to Top