శాసన మండలిని రద్దు చేయాల్సిందే!

మండలిలో ప్రజా తీర్పును అపహాస్యం చేశారు

పెద్దల సభకు చంద్రబాబు తన ఇంట్లో ఉన్న దద్దమ్మను పంపించారు

ఎమ్మెల్యే ఆర్కే రోజా

అసెంబ్లీ మీడియా పాయింట్‌: శాసన మండలిని టీడీపీ నేతలు రాజకీయాలకు వాడుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి అడ్డుగా ఉన్న శాసన మండలిని రద్దు చేయాల్సిందే అని ఆమె విజ్ఞప్తి చేశారు. శాసన సభలో ఆమెదించిన బిల్లును మండలిలో అగౌరవపరిచారని ధ్వజమెత్తారు. సోమవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్‌లో రోజా మాట్లాడారు.
ప్రజా తీర్పును టీడీపీ అపహాస్యం చేస్తోంది. పెద్దల సభ సలహాలు ఇచ్చే సభలా ఉండాలి. ప్రజల తీర్పును పెద్దల సభ గౌరవించాలి. సభలను భ్రష్టు పట్టిస్తున్న టీడీపీ నేతలకు బుద్ధి చెప్పాలి. దేశంలో 6 రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలిలు ఉన్నాయి. అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న శాసన మండలిని రద్దు చేయమని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. చంద్రబాబు శాసన మండలి వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు అడుగులు ముందుకు వేస్తున్నారు. చంద్రబాబు అమరావతిలో రాజధాని పెట్టి ఎలాంటి అభివృద్ధి చేయకుండా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా, అమరావతిని లెజిస్లేటివ్‌ రాజధానిగా, కర్నూలును జ్యుడిషియల్‌ రాజధానిగా చేసేందుకు ఆలోచన చేస్తున్నారు. అన్ని కమిటీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. టీడీపీ నేతలు మాట్లాడుతున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయి. వైయస్‌ జగన్‌ ఎమ్మెల్సీలతో భేరసారాలు చేస్తున్నారని ఎల్లో మీడియాలో వార్తలు రాస్తున్నారు. ఆ అలవాటు చంద్రబాబుకే ఉంది. సిగ్గులేకుండా తెలంగాణలో ఓ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగి ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయాడు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్‌ను వదిలేసి పారిపోయి వచ్చాడు. చంద్రబాబు వేధవ అయితే అందరూ అలాగే అవుతారా?. వైయస్‌ జగన్‌ ఏ రోజు కూడా ఇలాంటివి ఒప్పుకోరు. పెద్దల సభకు పెద్దలను పంపించాలని కానీ, తన ఇంట్లో ఉన్న దద్దమ్మను శాసన మండలికి పంపించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన యనమల రామకృష్ణుడు లాంటి వ్యక్తులు ఈ రోజు శాసన మండలిలో ఉండటం దురదృష్టకరం. ప్రజల కోసం చేస్తున్న బిల్లులను వ్యతిరేకిస్తున్నారంటే..చంద్రబాబుకు ఓడిపోయిన అహంకారం తగ్గడం లేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులు ఈ శాసన మండలిని రద్దు చేయాలని కోరుతున్నారు. దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు.

Back to Top