విద్యలో సంస్కరణలతో అంబేద్కర్‌ కలలు నెరవేరినట్లే

ఎమ్మెల్యే గొల్ల బాబూరావు
 

అసెంబ్లీ:అంబేద్కర్‌ కలల సమాజాన్ని సీఎం వైయస్‌ జగన్‌ నిజం చేశారని, విద్యలో సంస్కరణలతో అంబేద్కర్‌ కలలు నెరవేరినట్లే అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు పేర్కొన్నారు. క్షవాడి కొడుకు డాక్టర్‌ కావాలని సీఎం ఆకాంక్షించారు. రైతు కొడుకు ఇంజినీర్‌ కావాలని సీఎం భావించారు. ఇంగ్లీష్‌ విద్యతో పేద విద్యార్థులకు మేలు. పేదలు తమ పిల్లల చదువుల కోసం చాలా కష్టపడుతున్నారు. కొంత మంది అప్పులు కూడా చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం తప్పనిసరి. ప్రైవేట్‌ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  ప్రైవేట్‌ స్కూళ్లలో విద్యార్థులపై ఒత్తిడి పెరిగింది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడం మంచి పరిణామం. ఈ బిల్లును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.

Back to Top