వైయస్‌ జగన్‌ సీఎం కావడం ఖాయం

తలకిందులు వేలాడినా పప్పు సీఎం కాలేడు

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ జెండా మోసే దుర్బుద్ధి రాజగోపాల్‌ కుటుంబానిది

సర్పంచ్‌గా గెలవలేని వారు జననేతను విమర్శించడం విడ్డూరం

చంద్రబాబు అవినీతి సామ్రాట్, అభివృద్ధి నిరోధకుడు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అంజద్‌ భాషా

వైయస్‌ఆర్‌ జిల్లా: తలకిందకు, కాళ్లుపైకి పెట్టినా పప్పు (నారా లోకేష్‌) ముఖ్యమంత్రి కాలేడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంజద్‌ భాషా అన్నారు. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి చంద్రబాబు తాపత్రయపడుతున్నాడన్నారు. రాబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఐదు కోట్ల ఆంధ్రప్రజలు నిశ్చయించుకున్నారన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంజద్‌ భాషా మాట్లాడుతూ.. వార్డు మెంబర్‌గా కూడా గెలవని వారు వైయస్‌ జగన్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ జెండా మోసే నీచ సంస్కృతి రాజగోపాల్‌రెడ్డి కుటుంబానిదన్నారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. అభివృద్ధిని చూస్తే చంద్రబాబు గుర్తుకు వస్తారని చెబుతున్నారని, చంద్రబాబును చూస్తే అవినీతి, అరాచకాలు గుర్తుకు వస్తాయన్నారు. అభివృద్ధి నిరోధకుడు, అవినీతి సామ్రాట్‌ చంద్రబాబు అన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందని, పది అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్‌ స్థానాలు వైయస్‌ఆర్‌ సీపీవే అన్నారు. 

రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవాలని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తుల పాదయాత్ర చేసిన ఘనత వైయస్‌ఆర్‌ కుటుంబానికే దక్కిందన్నారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రజలను ఎలా ఆదుకోవాలో తన పథకాలతో చూపించారన్నారు. అదే విధంగా వైయస్‌ షర్మిల కూడా పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారన్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని వారికి భరోసా ఇచ్చేందుకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో, భవిష్యత్తులో ఎవరూ చేయని విధంగా 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారన్నారు. కోట్లాది మంది ప్రజలను కలుసుకొని భరోసా కల్పించారన్నారు. పాదయాత్రపై టీడీపీ నేతలు అవాకులు పేలుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. 

చంద్రబాబు పాదయాత్ర మార్నింగ్‌ వాక్, ఈవినింగ్‌ వాక్‌లా చేశారని అంజద్‌భాషా ఎద్దేవా చేశారు. రెండు మూడు కిలోమీటర్లు నడిచి బస్సుల్లో పడుకొని దొంగ పాదయాత్ర చేశాడన్నారు. ప్రజలంతా పడుకునే సమయంలో పాదయాత్ర చేసిన వ్యక్తం చంద్రబాబు అని ధ్వజమెత్తారు. పాదయాత్రకు, బహిరంగ సభకు తరలివచ్చిన ప్రజలను చూస్తే స్పష్టమైన సంకేతం తెలిసిపోతుందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. 

 

Back to Top