ఆల‌యాల్లో జ‌రుగుతున్న ఘ‌ట‌న‌ల‌ను నివారించేందుకు ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌

మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌
 

విజ‌య‌వాడ‌:  దేవాల‌యాల్లో జ‌రుగుతున్న ఘ‌ట‌న‌ల‌ను నివారించేందుకు ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ ఏర్పాటుపై చ‌ర్చిస్తున్నామ‌ని మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు. సోమ‌వారం దేవాదాయ‌, పోలీస్ శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో మంత్రి స‌మావేశం కానున్నారు.ఆల‌యాల్లో జ‌రుగుతున్న వ‌రుస ఘ‌ట‌న‌ల నివార‌ణ‌పై ప్ర‌భుత్వం దృష్టిపెట్టిన‌ట్లు మంత్రి చెప్పారు. ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ ఏర్పాటుపై చ‌ర్చిస్తున్నామ‌ని, పోలీసు శాఖ‌తో స‌మ‌న్వ‌యం చేసుకునేందుకు ప్ర‌త్యేక ఏర్పాట్ల‌పై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నామ‌న్నారు. ఆల‌యాల భ‌ద్ర‌త‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చిస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌తి ఆల‌యం వ‌ద్ద సెక్యూరిటీ సిబ్బందిని నియ‌మించే విష‌యంలో సాధ్యాసాధ్యాలను ప‌రిశీలిస్తున్నామ‌ని చెప్పారు.ఇప్ప‌టికే వివిధ ఆల‌యాల వ‌ద్ద సీసీ కెమెరాలు పెట్టాల‌ని దేవాదాయ శాఖ నిర్ణ‌యం తీసుకుందని మంత్రి వెల్లంప‌ల్లి చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top