గ్రామాల్లో మొక్క‌లు పెంచే బాధ్య‌త స‌ర్పంచ్‌ల‌దే

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి 
 

తిరుపతి:  గ్రామాల్లో మొక్కలను పెంచే బాధ్యతను సర్పంచ్‌లకు అప్పగిస్తున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పైలట్‌ ప్రాజెక్ట్‌గా చిత్తూరు జిల్లాను ఎంపిక చేశామని ఆయ‌న వెల్ల‌డించారు. జగనన్న పచ్చతోరణంపై ప్రత్యేక దృష్టి పెట్టామని మంత్రి తెలిపారు.  శనివారం తిరుప‌తిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 

గత ప్రభుత్వ హయాంలో జరిగిన నరేగా పనులపై విచారణ జరుగుతోందని మంత్రి అన్నారు. ఇప్పటికే రూ.5లక్షలలోపు పెండింగ్‌లో ఉన్న నరేగా బిల్లులను చెల్లించామని.. మిగిలిన పనులకు విజిలెన్స్‌ నివేదిక రాగానే చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి  పేర్కొన్నారు.

Back to Top