రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం

రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

నెల్లూరు: రైతుల ప్రయోజనాల కోసమే సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని, అన్నదాత సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. అందుకే కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు మద్దతు ఇచ్చామన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరు రైతులపై కేసులను రద్దు చేయాలని అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారని, సీఎం ఆదేశాల మేరకు అధికారులు రైతులపై కేసులు ఎత్తివేశారన్నారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాయింట్‌ కలెక్టర్‌ను నోడల్‌ అధికారిగా నియమించి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. జిల్లాలోని గోడౌన్లలోని బియ్యాన్ని ఇతర జిల్లాలకు పంపుతున్నామన్నారు. ధాన్యం కొనుగోలు గడువును పెంచేందుకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కృషి చేశారని చెప్పారు. కేంద్ర బృందం పర్యటన తర్వాత పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని వివరించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top