స‌హ‌కార వ్య‌వ‌స్థ‌ను ఆధునీక‌రిస్తాం

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు

తూర్పుగోదావరి: సహకార వ్యవస్థను పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 డీసీసీబీ బ్రాంచ్‌ల‌ను ఏర్పాటు చేస్తామన్నారు. మంత్రి క‌న్న‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. రైతులతో పాటుగా డ్వాక్రా సంఘాలకు సహకార రంగం ద్వారా రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దివంగత మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారని, ఆయన వారసుడు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. క‌మీష‌న్ల కోసం పోల‌వ‌రం ప్రాజెక్టును చంద్ర‌బాబు వాడుకున్నాడ‌ని, టీడీపీ పాల‌న‌లో పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్ల‌క్ష్యానికి గురైంద‌ని మండిప‌డ్డారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నార‌ని చెప్పారు. 

Back to Top