ఇసుక కొరతను రాజకీయం చేయడం సిగ్గుచేటు

మంత్రి కన్నబాబు
 

సచివాలయం: ఇసుక కొరతను చంద్రబాబు రాజకీయం చేయడం సిగ్గు చేటు అని మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో గత నాలుగు నెలల నుంచి వరదలు వచ్చాయన్నారు. వరదల కారణంగా కొంత ఇ సుక కొరత ఉందన్నారు. దీన్ని రాజకీయ అవసరాల కోసం లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. ఒక వైపు ఇసుక కొరత ఉంటే చంద్రబాబు, లోకేష్‌కు మహా ఆనందంగా ఉందన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష పేరుతో డ్రామాలాడుతున్నారన్నారు. గత ఐదేళ్లలో ఇసుకను విచ్చలవిడిగా దోచుకున్నారని ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వం ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఉందన్నారు. ఇసుక కొరత తీర్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. 
 

Read Also: ఇదీ వాస్తవం.. బాబును భవన కార్మికులే కొడతారు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top