ఇదీ వాస్తవం.. బాబును భవన కార్మికులే కొడతారు

 

అమరావతి: భవన నిర్మాణ కార్మికులపై చంద్రబాబు, లోకేష్‌ ఎక్కడా లేని ప్రేమ వలకబోస్తున్నారు. కార్మికులు తమకు తోబుట్టువులు అన్నంత రేంజ్‌లో మాట్లాడడం, వారి కోసం దీక్షలు చేయడం చేస్తున్నారు. కార్మికుల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఆత్మహత్యలు చేసుకునే విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న చంద్రబాబు అసలు రంగు తెలిస్తే ఆ కార్మికులే చంద్రబాబును తరిమికొట్టక తప్పదు మరీ.

2009లో భవన కార్మికుల సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తరువాత రూ.13 వందల కోట్లు నిధి నిల్వ ఉంది. దాన్ని సెస్‌ రూపంలో సక్రమంగా వసూలు చేస్తే దాదాపు రూ.10 వేల కోట్లు వచ్చేది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కార్మికుల సంక్షేమ నిధిని ఇష్టానుసారంగా వాడుకున్నాడు. కార్మికుల నిధిని తన ఇంటికి వెళ్లే రోడ్ల కోసం.. హెరిటేజ్‌ కంపెనీ కోసం, ప్రచార ఆర్భాటం కోసం వందల కోట్ల రూపాయలను వాడేసుకున్నాడు.

కార్మికుల సంక్షేమ నిధిని సీఆర్‌డీఏ రోడ్ల కోసం, హెరిటేజ్‌ కంపెనీ నష్టాల్లో ఉన్నప్పుడు చంద్రన్న కానుకలు, బెల్లం అంటూ వాడేశాడు. వేసవికాలంలో చలివేంద్రాలు అంటూ హెరిటేజ్‌ మజ్జిగకు రూ.38 కోట్లు కేటాయించింది కూడా కార్మికుల సంక్షేమ నిధి నుంచే. మేడే రోజున రూ. 50 కోట్లు ఈ నిధి నుంచి డ్రా చేశాడు. కార్మికుల సంక్షేమ నిధిని ఇష్టానుసారంగా దోచేశాడు.

తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు సుమారు 600 కార్మికులకు వివిధ కారణాల ద్వారా సంక్షేమ నిధి నుంచి పరిహారం చెల్లించాల్సి ఉంటే కేవలం 50 మందికి రూ.25 లక్షలు ఇచ్చాడు. 500 మందికిపైగా కార్మికులకు పెండింగ్‌లో పెట్టాడు. బాబు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మందిని మోసం చేశాడనేదానికి ఇదొక ఉదాహరణ.

 

Read Also: చంద్రబాబు పాపాల వల్లే ఇసుక కొరత

Back to Top