చంద్రబాబు పాపాల వల్లే ఇసుక కొరత

మంత్రి పేర్నినాని
 

విజయవాడ: గత ఐదేళ్లు చంద్రబాబు చేసిన పాపాల కారణంగా ఇవాళ రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని మంత్రి పేర్నినాని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నదిలోని ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేశారని, యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టడంతో ఇవాళ సుప్రీం కోర్టు ఆంక్షలు విధించిందన్నారు. నదిలో నీళ్లు ఉండగా ఇసుక ఎలా లభిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇల్లు కాలి ఒకడు బాధపడుతుంటే..చుట్ట కాల్చుకునేందుకు కాలిన ఇల్లు ఉపయోగించుకున్నాడట మరొకడు అన్న చందంగా ఉంది నారా లోకేష్‌ పరిస్థితి అన్నారు. తండ్రి కొడుకులు ఇసుక కొరత పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక కోసం నారా లోకేష్‌ దీక్ష చేయడం హాస్యాస్పదమన్నారు. నదిలో నీళ్లుండగా ఇసుక ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. గత ఐదేళ్లు టీడీపీ చేసిన పాపాల కారణంగా నదిలో పోక్లేన్లు దించకూడదని, డ్రిల్లింగ్‌ చేయకూడదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా తక్కువ ధరకే ప్రజలకు నేరుగా అందించేందుకు కృషి చేస్తుందన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బాధ్యతల గల ముఖ్యమంత్రి కాబట్టే వారం రోజుల పాటు ఇసుక వారోత్సవాలు నిర్వహించి, ఇసుక కొరత తీర్చేందుకు ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. 

 

Read Also: డైటింగ్‌ కోసమే లోకేష్‌ దీక్షలు

తాజా ఫోటోలు

Back to Top