డైటింగ్‌ కోసమే లోకేష్‌ దీక్షలు

వరదల కారణంగా ఇసుక కొరత

ఇసుక కొరతను చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారు

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ: అధికారంలో ఉండే ఐదేళ్లు దోచుకున్నది అరగడానికి చంద్రబాబు తనయుడు లోకేష్‌ ఇసుక కొరత పేరుతో డైటింగ్‌ చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్‌ అడుగు పెట్టడంతో గత ఐదేళ్లలో సకాలంలో వర్షాలు కురవలేదన్నారు. సీఎంగా వైయస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టాక విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. జలాశయాలన్నీ నీటితో కళకళలాడుతున్నాయన్నారు. వర్షాలు, వరదల కారణంగా ఇసుక కొరత ఏర్పడిందని చెప్పారు. దీన్ని చంద్రబాబు అవకాశంగా మార్చుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఇసుక పేరుతో చంద్రబాబు ఐదు గంటల పాటు డైటింగ్‌ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దీక్షలు ప్రజల కోసం కాదని పేర్కొన్నారు.

Read Also: చంద్రబాబు రాజకీయ దళారీ

Back to Top