రేపు పామిడిలో వైయస్ జగన్ పర్యటన

వివాహ రిసెప్షన్‌లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్న వైయ‌స్ఆర్‌సీపీ అధినేత

తాడేపల్లి : వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (12.05.2026) అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని పామిడి పట్టణంలో పర్యటించనున్నారు. మంగ‌ళ‌వారం ఉదయం 11 గంటలకు పామిడి చేరుకోనున్న శ్రీ వైయస్ జగన్, ఏడీసీసీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ ఎం. వీరాంజనేయులు (వీరా) నివాసంలో నిర్వహించనున్న వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎం. వీరాంజనేయులు కుమార్తె లిఖిత వివాహం ఇటీవల వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎ. మధుసూధన్ (ఆదోని) కుమారుడు చైతన్యమిత్రతో జరిగింది.
ఈ సందర్భంగా నూతన వధూవరులను కలిసి వివాహ శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించనున్న శ్రీ వైయస్ జగన్, అనంతరం మధ్యాహ్నం తిరుగు పయనమవుతారు.
 

Back to Top