తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్న భూమన కరుణాకర రెడ్డి

తిరుపతి : తిరుపతి నగర ఆధ్యాత్మిక చిహ్నమైన తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో మాజీ టీటీడీ చైర్మన్, వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకర రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న భూమన కరుణాకర రెడ్డి రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. తిరుపతి గంగమ్మ జాతరకు విశిష్టమైన చరిత్ర ఉందని, ప్రజల విశ్వాసాలకు ప్రతీకగా ఈ దేవస్థానం నిలుస్తోందని పేర్కొన్నారు. దర్శనం అనంతరం ఆలయ పరిసరాల్లో భక్తులతో పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
 

Back to Top