టీడీపీ విషపు పార్టీ.. ఆ నలుగురు ఓ 420 బ్యాచ్

చీప్ లిక్క‌ర్‌కు బ్రాండ్ బాబే.. సారాకు పేరు పెట్టింది టీడీపీనే

మద్యంలో పుట్టి, మద్యంతోనే పెరిగిన బాబు అండ్ కో ప్రభుత్వంపై విమర్శలా..?

కమీషన్లు తీసుకుని డిస్టలరీలకు 25 ఏళ్ళు నడిపేందుకు అనుమతులు ఇచ్చింది చంద్రబాబే

నారా లోకేష్‌ది క్వార్టర్‌ నాలెడ్జ్‌... బాడీతో పాటు బ్రెయిన్‌ కూడా తగ్గినట్లుంది

పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

అసెంబ్లీ: టీడీపీ-ఎల్లో మీడియా విమర్శిస్తున్న మద్యం బ్రాండ్లు ఎవరి ప్రభుత్వం హయాంలో అనుమతులు ఇచ్చారు, ఆ బ్రాండ్లు తెచ్చిన ప్రబుద్ధుడు ఎవరు.. అనేదానిపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారని పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. ఆ వాస్తవాన్ని అంగీకరించే దమ్మూ, ధైర్యం లేక టీడీపీ ఎమ్మెల్యేలు డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద మంత్రి కొడాలి నాని మాట్లాడారు. 

మంత్రి కొడాలి నాని ఇంకా ఏమన్నారంటే..

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా పెద్దఎత్తున కమీషన్లు తీసుకుని డిస్టలరీలకు అనుమతులు ఇచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్లిపోయాడు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనుడు చంద్రబాబే. ఈ రాష్ట్రంలో నాటు సారాను కనిపెట్టిన వ్యక్తే చంద్రబాబు నాయుడు. సారాను బాటిల్‌లో పోసి, దానికి వారుణి- వాహిని అని  పేరుపెట్టింది కూడా తెలుగుదేశం పార్టీయే. తప్పుడు పనులు టీడీపీ  చేసి, పైపెచ్చు జె బ్రాండ్లు అని, డిస్టల‌రీ రద్దు చేయాలని చంద్రబాబు చెబితే, టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేయడం విచిత్రంగా ఉంది. రద్దు చేస్తే 24 గంటల్లో మళ్ళీ వారే కోర్టుకు పంపించి స్టే లు తెచ్చుకుంటారా? లేదా?. 

చంద్రబాబు నాయుడు డిస్టలరీలు పెట్టినవాళ్ల దగ్గర నుంచి, కమీషన్లు తీసుకుని, 25 ఏళ్ల పాటు నడుపుకునేందుకు లైసెన్స్‌లు ఇచ్చాడు. మేము వాటిని రద్దు చేస్తే వాళ్లంతా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారనే విషయం బాబుకు తెలియదా?. తాను అనుమతులు ఇచ్చిన డిస్టలరీలను తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా రద్దుచేసే అవకాశం లేకుండా అనుమతులు ఇచ్చి, ఈరోజు మళ్ళీ  సిగ్గులేకుండా నంగనాచి మాటలు మాట్లాడుతున్నాడు. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, లెజెండ్, 999 పవర్ స్టార్, బూమ్‌ బూమ్‌ బీరు.. ఇలాంటి పిచ్చి బ్రాండ్లకు అనుమతి ఇచ్చింది చంద్రబాబే. వీటిని మా ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ నిన్న ఆధారాలతో సహా ప్రజల ముందుకు తెస్తే.. టీడీపీకి ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోయారు.

తండ్రిలాంటి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఎన్టీఆర్‌ హయాంలోనే,  టీడీపీ అభ్యర్థి చేతిలో చంద్రగిరిలో చిత్తుచిత్తుగా ఓడిపోయాడు.  ఔరంగజేబులాంటి చంద్రబాబు తనకే కాదని, రాబోయే రోజుల్లో ప్రజలకు కూడా వెన్నుపోటు పొడుస్తాడని ఎన్టీఆర్‌ అప్పుడే చెప్పారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే చంద్రబాబును నమ్మితే..  ఆంధ్రరాష్ట్రం నాశనం అవుతుందని చెప్పారు. వెన్నుపోటుకు పేటెంట్‌ చంద్రబాబు నాయుడు. కమీషన్లు తీసుకుని పార్టీని నడుపుతూ.. కుటుంబ ఆస్తులు పెంచుకున్న వ్యక్తి చంద్రబాబే అన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ విషయాలన్నింటినీ ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర అసెంబ్లీలో ఆధారాలతో సహా ప్రజలందరికీ తెలియచేశారు. 

రాష్ట్రంలో ప్రజలంతా అమాయకులు, తాము ఏది చెబితే అది నమ్ముతారని, బాకా ఊదే నాలుగు డబ్బా ఛానల్స్‌, పనికిరాని రెండు చెత్త పేపర్లు, అదే పనిగా, చర్చలు, డిబేట్‌లు అంటూ..  గంటలుకొద్దీ సొల్లు పురాణాలు చెబితే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా..?. చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఆ నలుగురు - 420 బ్యాచ్‌ (చంద్రబాబు నాయుడు, రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు) తలక్రిందులుగా తపస్సు చేసినా నమ్మరు. ఈ నలుగురు 420లు తాము ఏది చెప్పినా జనాలు నమ్ముతారనే పిచ్చి భ్రమలో బతుకుతున్నారు.

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను 175 జిల్లాలు చేయాలని పప్పు లోకేష్‌ చెబుతున్నాడు. మరి నువ్వు ఏ జిల్లాలో ఉంటావు లోకేష్‌...? అసలు నీకు నియోజకవర్గమే లేదు?. మరి, కొత్త జిల్లాలు మీకు ఇష్టం లేనప్పుడు, కుప్పంను రెవెన్యూ డివిజన్‌ చేయాలని చంద్రబాబు లేఖ రాయడం సిగ్గుచేటు కాదా..? చంద్రబాబును ఆ నియోజకవర్గ ప్రజలు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పుడేం చేశావు, ఎందుకు రెవెన్యూ డివిజన్ చేయలేకపోయావు చంద్రబాబూ..?. మరోవైపు లోకేష్ మామ, హిందుపురాన్నిజిల్లా చేయాలి, రెవెన్యూ డివిజన్‌ చేయాలని అడుగుతారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరంతా ఏం చేశారు.. ? 

ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు.. గ్రామ సచివాలయల ద్వారా  గడపగడపకూ సేవలు అందించాలని, ఆర్బీకేల ద్వారా రైతుల సమస్యలను గ్రామాల్లోనే తీర్చాలని, పరిపాలనను వికేంద్రీకరణ చేయాలని, 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తే ప్రజలకు మరింత చేరువలో పరిపాలన తెస్తుంటే, దానిపై కూడా ఏడుస్తున్నారు. సీఎం వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డితో నేరుగా యుద్ధం చేయడం చేత కాక, వ్యవస్థలను అడ్డుపెట్టుకుని, మేనేజ్ చేసి నీచ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే.. మీకు కూడా ప్రజలు రాజకీయ సమాధి కడతారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు, టీడీపీకి, మీకు పది కిలోమీటర్ల లోతులో గొయ్యి తీసి, పాతిపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు.

ఆఖరికి ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అవ్వాలనకుని వెక్కి వెక్కి ఏడ్చి, అసెంబ్లీ నుంచి పారిపోయి ఇంట్లో పడుకున్న చంద్రబాబు.. మళ్ళీ, అసెంబ్లీ సమావేశాలు పూర్తిఅవగానే ఓ రెండుగంటలు ప్రెస్‌మీట్‌ పెట్టి రాష్ట్రంలో ఏదో అయిపోయిందంటూ పిచ్చి కబుర్లు చెప్పడానికి వస్తాడు. అల్జీమర్స్‌తో బాధపడుతున్న చంద్రబాబు నాయుడు అండ్ 420 బ్యాచ్ ను 2024 వరకు భరించాల్సిందే. రాబోయే ఎన్నికల్లో ఈ ఎల్లో బ్యాచ్  అందరికీ వైయ‌స్‌ జగన్ రాజకీయ సమాధి కడతారు. తెలుగుదేశం పార్టీ విష ప్రచారం చేయడంలో దిట్ట. ఆ పార్టీనే ఒక విషపు పార్టీ. అప్పట్లో ఎన్టీఆర్ అమలు చేసిన మద్యపాన నిషేధాన్ని చంద్రబాబు ఎందుకు తొలగించాడో ముందుగా చెప్పాలి. మద్యం, సారా గురించి మాట్లాడేవాళ్లు, చంద్రబాబు ఎందుకు మద్యపాన నిషేధం తొలగించి చీప్‌ లిక్కర్‌ను ఎందుకు తెచ్చారో సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో చీప్‌ లిక్కర్‌ను ప్రవేశపెట్టిందే చంద్రబాబు నాయుడు. 

దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. అందుకు కట్టుబడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. పేదవాడు మద్యం ముట్టుకుంటే కరెంట్‌ షాక్‌ కొట్టినట్లు ఉండాలని రేట్లు పెంచారు. మరి రేట్లు పెంచితే ఆదాయం పెరగదా? రాష్ట్ర ప్రజలు వైయ‌స్ జగన్‌ని, వైయ‌స్‌ జగన్‌ ప్రజలను నమ్మారు. మద్యంలోనే పుట్టి మద్యంతోనే వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న నిష్ట దరిద్రుల సూచనలు మాకు అవసరం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలకు శాసనసభ మీద కానీ, ప్రజాస్యామ్యం మీదకానీ నమ్మకం లేదు కాబట్టే..  అసెంబ్లీలో మద్యంపై చర్చకు రాకుండా, సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. నారా లోకేష్‌ది క్వార్టర్‌ నాలెడ్జ్‌... బాడీతో పాటు బ్రెయిన్‌ కూడా తగ్గినట్లు ఉంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top