కుల‌మ‌తాల మ‌ధ్య చిచ్చుపెట్టి ల‌బ్ధిపొందాల‌ని బాబు ప్ర‌య‌త్నం

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

బీజేపీ అజెండాను చంద్ర‌బాబు ఫాలో అవుతున్నారు

విశాఖ ప్ర‌జ‌ల‌పై చంద్ర‌బాబుకు ధ్వేషం ఎందుకు?

తాడేప‌ల్లి: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు రాష్ట్రంలో కుల మ‌తాల మ‌ధ్య చిచ్చుపెట్టి ల‌బ్ధిపొందాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విమ‌ర్శించారు. చంద్ర‌బాబు ఆందోళ‌న‌తో రాష్ట్రానికి ప్ర‌యోజ‌నం ఉందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. శ‌నివారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అయ్యాక ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌న్నీ అమ‌లు చేస్తున్నార‌న్నారు. కుల‌మ‌తాల‌కు అతీతంగా సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్నార‌ని చెప్పారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న చంద్ర‌బాబుకు ప్ర‌శ్నించే ప‌ని లేకుండా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జారంజ‌క పాల‌న అందిస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్లేందుకు ప్ర‌తిప‌క్షం  మొద‌ట కులాల మ‌ధ్య చిచ్చు పెట్టింద‌ని..ప్ర‌జ‌లు ఆయ‌న మాట‌లు న‌మ్మ‌క‌పోవ‌డంతో..తాజాగా మ‌తాల మ‌ధ్య చిచ్చు పెట్టి ల‌బ్ధి పొందాల‌ని చూస్తున్నార‌ని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు బీజేపీ అజెండాను ఫాలో అవుతున్నార‌ని పేర్కొన్నారు. చంద్ర‌బాబు డ్రామాల‌ను ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితిలో లేద‌న్నారు.

ఉత్త‌రాంధ్ర అభివృద్ధి చెందొద్దా?

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ధి చేయాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వికేంద్రీక‌ర‌ణ నిర్ణ‌యం తీసుకున్నార‌ని మంత్రి బొత్స పేర్కొన్నారు. విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధాని చేయాల‌ని సీఎం ప్ర‌య‌త్నిస్తుంటే..చంద్ర‌బాబు అడ్డుప‌డుతున్నార‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఉత్త‌రాంధ్ర అభివృద్ధి చెందొద్దా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.విశాఖ ప్ర‌జ‌ల‌పై చంద్ర‌బాబుకు ఎందుక ధ్వేష‌మ‌ని నిల‌దీశారు. విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధాని చేస్తామంటే విష ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విశాఖ అభివృద్ధి వైయ‌స్ఆర్ హ‌యాంలోనే జ‌రిగింద‌ని చెప్పారు. విశాఖ‌కు వ‌చ్చే పెట్టుబ‌డుల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని విమ‌ర్శించారు. టీడీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి ఆగ‌ద‌ని బొత్స స్ప‌ష్టం చేశారు.

గ‌త ఐదేళ్లు అడ్డంగా దోచుకున్నారు..
టీడీపీ పాల‌న‌లో ఐదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డంగా దోచుకున్నార‌ని మంత్రి బొత్స విమ‌ర్శించారు.త‌ప్పు చేసిన వారు శిక్ష అనుభ‌వించ‌క త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. టీడీపీ హ‌యాంలో పంచ‌భూతాల‌ను పంచుకుతిన్నార‌ని విమ‌ర్శించారు. త‌ప్పు చేయ‌క‌పోతే కోర్టుకు వెళ్లి స్టేలు ఎందుకు తెచ్చుకుంటున్నార‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ ప్ర‌శ్నించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top