వ్యవసాయానికి బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యత

వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి

రైతుల కష్టాలను సీఎం వైయస్‌ జగన్‌ కళ్లారా చూశారు

బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 12.66 శాతం నిధులు

వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకానికి రూ.8750 కోట్లు

పగటి పూట 9 గంటల విద్యుత్‌కు రూ.4,525 కోట్లు

వడ్డీ లేని పంట రుణాలకు రూ.100 కోట్లు 

గత ప్రభుత్వం విత్తన కంపెనీలకు బకాయిలు చెల్లించలేదు

ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు భరోసా కల్పించారు

అమరావతి: రైతుల కష్టాలు కళ్లారా చూశారు కాబట్టే వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత కల్పించారనివ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి తెలిపారు. బడ్జెట్‌లో వ్యవసాయానికి అత్యధిక కేటాయింపులు చేశారని చెప్పారు. మొత్తం బడ్జెట్‌లో వ్యవసాయానికి 12.66 శాతం కేటాయింపులు చేశారని నాగిరెడ్డి తెలిపారు. చంద్రబాబు లాగా ఏసీ గదుల్లోను, సింగపూర్‌ ఫ్లైట్‌లలో కూర్చొని బడ్జెట్‌ తయారు చేయలేదన్నారు. బడ్జెట్‌ కేటాయింపులపై  శనివారం విజయవాడలో నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వ్యవసాయానికి పగలు 9 గంటల విద్యుత్‌ ఇవ్వాలంటే 40 శాతం ఫీడర్స్‌లో రూ.1700 కోట్లు పెట్టి మార్చి, ఏప్రిల్‌ నాటికి పూర్తి చేస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నట్లు చెప్పారు. 9 గంటల విద్యుత్‌ కోసం రూ.4,525 కోట్లు కేటాయించారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా పంటలకు ఉచిత బీమా పథకం ప్రకటించడం, దానికి రూ.1100 కోట్లు నిధులు మంజూరు చేయడం గొప్ప విషయమన్నారు. విత్తనాల రాయితీ రూ.200 కోట్లు ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం రూ.380 కోట్లు బకాయిలు చెల్లించకుండా అన్యాయం చేశారని తెలిపారు.

బిందు, తుంపర సేద్యానికి రాయితీ కోసం రూ.1125 కోట్లు కేటాయించారని తెలిపారు. ఆక్వా రైతులకు కరెంటు యూనిట్‌ రూ.1.50కే ఇస్తామని పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా హామీ ఇచ్చారని, ఆ హామీ అమలు చేస్తున్నారని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో రూ.7.50 లక్షలు ఇవ్వడంతో బాధిత కుటుంబాలకు ఊరటగా ఉంటుందని చెప్పారు. చంద్రబాబు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పట్టించుకోలేదన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వారికి సాయం చేస్తే ఆ డబ్బుల కోసం మరికొంత మంది ఇలా చేస్తారని చంద్రబాబు దుర్మార్గంగా మాట్లాడారని గతాన్ని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలతో పని చేస్తున్న వైయస్‌ జగన్‌ రైతు కుటుంబాలకు అండగా నిలిచారన్నారు. ఉచిత బోర్లు వేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చారని, ఆ మేరకు నిధులు కేటాయించారన్నారు. వడ్డీ లేని పంట రుణాలకు రూ.100 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. చంద్రబాబుకు, ఆయన పార్టీ నేతలకు క్షేత్రస్థాయిలో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు.

ధరల స్థిరీకరణకు రూ.3 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని చెప్పడం సంతోషకరమన్నారు. ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సీ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినట్లు చెప్పారు. నియోజకవర్గానికి ఒక ల్యాబ్‌ ఏర్పాటు చేసి విత్తనాలు, ఎరువుల నాణ్యతను పరిశీలిస్తామన్నారు. కరువుతో అల్లాడుతున్న తరుణంలో పశుగ్రాసం కోసం రూ.100 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఉద్యానవనం, మత్య్సశాఖ, ఫామాయిల్‌ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు నిధులు కేటాయించారన్నారు. పౌల్ట్రీ రైతుల ప్రోత్సాహం కోసం నిధులు కేటాయించామన్నారు.

చేపల వేట నిషేధిత సమయంలో మత్స్యకారులకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. సముద్రంలో ఉంటున్న మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. దేశవాలీ పశువులకు, సంకర జాతీ పశువులకు ప్రభుత్వం నుంచే ఇన్సురెన్స్‌ చెల్లిస్తుందన్నారు. సాగునీరు, వరదల నివారణకు బడ్జెట్లో నిధులు కేటాయించడం గొప్ప విషయమన్నారు. జలయజ్ఞంలోని ప్రాజెక్టులన్నీ కూడా వైయస్‌ జగన్‌ ఆరో ప్రాణంగా తీసుకున్నారని, వాటన్నింటిని పూర్తి చేస్తారని తెలిపారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని,రైతుల కోసం పని చేసే ప్రభుత్వం ఉందని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మీ కష్టాల్లో తోడుగా ఉంటారని తెలిపారు. లోకేష్‌..మీ నాన్నను ట్వీట్టర్‌లో ప్రశ్నించాలని, రైతు రుణాలు ఎంత వరకు మాఫీ చేశామని, సముద్రాన్ని కట్టడి చేస్తామన్నా కూడా జనం నమ్మలేదని పోస్టు చేయాలని సలహా ఇచ్చారు. చేయని కార్యక్రమాల గురించి టీడీపీ నేతలు బుకాయించడం విడ్డూరంగా ఉందన్నారు. గత ఐదేళ్లలో రైతులకు ఏం చేశారో చర్చకు రావాలని సవాలు విసిరారు. 

 

Back to Top