సీఎంపై మతప్రచారం బాధాకరం

కులమతాలకు తావు లేకుండా సీఎం వైయస్‌ జగన్‌ పాలన

అభినందించాల్సింది పోయి దుష్ప్రచారం చేయడం దుర్మార్గం

డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా

సచివాలయం: కులం, మతం, వర్గం, పార్టీ తేడా లేకుండా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం వైయస్‌ జగన్‌ను అభినందించాల్సిందిపోయి మత ప్రచారం అంటగట్టడం బాధాకరమని డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాహనమిత్ర, రైతు భరోసా వంటి విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తూ కులమతాలకు తావులేకుండా పాలన చేస్తుంటే పచ్చమీడియా, ప్రతిపక్షాలు అన్యమతాన్ని అంటగడుతున్నారని మండిపడ్డారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతి రూ. 10 వేలకు పెంచారు. జనవరి 9న అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. సుమారు 45 లక్షల మంది తల్లులకు రూ. 10 వేల చొప్పున అందించనున్నాం. ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మతాన్ని అంగట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రిని అభినందించాల్సిందిపోయి దుష్ప్రచారం చేయడం బాధాకరమన్నారు. పవిత్ర జెరూసలెం, హజ్‌ యాత్రకు వెళ్లేవారికి ఆర్థిక సాయం అందిస్తుంటే పచ్చ పత్రికలు, పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తుందన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ తన ఉనికిని కాపాడుకునేందుకు అవాకులు పేలుతుందన్నారు.

Read Also: సంక్షేమ ఫలాలు అందించే 'నవశకం'

Back to Top