సంక్షేమ ఫలాలు అందించే 'నవశకం'

పేద ప్రజలకు అండగా ఉండేదుకు, సంక్షేమ ఫలాలు అందరికీ అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేసే ఏకైక ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. పేరుకు పథకాలు ప్రకటించి అర్హతల్లో కోత విధించిన గత ప్రభుత్వ రెండు నాల్కల సిద్ధాంతానికి స్వస్తి పలికింది వైయస్సార్ కాంగ్రెస్ సర్కార్. అసలైన అర్హులకే పథకాల వర్తింపు, లబ్దిదారుల ఎంపికలో నిష్పక్షపాతంగా వ్యవహిరిస్తోంది. అర్హత నిబంధనల్లోనూ సమూలమైన మార్పులు చేసి, మరింతమంది లబ్దిదారులకు మేలు చేకూర్చేలా వైయస్సార్ నవశకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 
పింఛన్లు
రాష్ట్రంలో మొత్తంగా 12 రకాల పింఛన్లు ప్రతినెలా పంపిణీ అవుతున్నాయి. గత ప్రభుత్వాలు సామాజిక పింఛన్ల వ్యవహారంలో చేసిన అవకతవకలన్నీ నేటి వైయస్సార్ నవశకం ద్వారా సరిదిద్దబోతున్నారు. ఉదాహరణకు చూస్తే గతంలో 40 నుంచి 79 శాతం అంగవైకల్యం ఉన్న వారికి నెలకు రూ.2000, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉంటే మరికొంత ఎక్కువ పింఛను అందేది. ఇప్పుడు దివ్యాంగులందరికీ రూ.3000 చొప్పున పింఛను అందిస్తున్నారు. వైకల్యానికి శాతాలతో కొలమానం లేకుండా చేయడం శుభపరిణామం. దీనివల్ల 3,89,094 మంది దివ్యాంగులు లబ్ది పొందుతున్నారు. 
అర్హతల పెంపు 
మరెన్నో సంక్షేమ పథకాలకు అర్హతా పరిమాణాలను పెంచారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. పెరుగుతున్న జీవన ప్రమాణాల దృష్ట్యా, తరుగుతున్న రూపాయి విలువను కూడా దృష్టిలో ఉంచుకుని వివిధ పథకాలకు అర్హతా నిబంధనల్లో మార్పులు చేసారు. ఉదాహరణకు గత ప్రభుత్వ హయాంలో కుటుంబ వార్షికాదాయం 90,000 దాటితే వారు ప్రభుత్వ పథకాలందుకునేందుకు అనర్హులు. బైక్ ఉన్నా, కారు ఉన్నా, 750 చ.అడుగుల ఇల్లు ఉన్నా, రెండెకరాల పైన భూమి ఉన్నా వారికి ప్రభుత్వ పథకాలు వర్తించేవి కాదు. పెరుగుతున్న ఖర్చుల స్థాయిలో ఆదాయం పెరగని వర్గాలకు ప్రభుత్వ పథకాలే ఆసరాగా నిలుస్తాయి. కానీ అర్హతా ప్రమాణాల్లో వ్యత్యాసం కారణంగా ఎందరో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆమడదూరంలో ఉండిపోతున్నారు. అలాంటివారి సంఖ్యను పెంచేందుకు, మరింత మంది అర్హులను ప్రభుత్వ పథకాల పరిధిలోకి తెచ్చేందుకు చేస్తున్న బృహత్తర ప్రయత్నమే వైయస్సార్ 'నవశకం'. 

Read Also: దేవినేని ఉమను టీడీపీ పక్కన పెట్టింది

Back to Top