తూర్పు గోదావరి జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు జనవరి 3న తూర్పు గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా శ్రీమతి. చెట్టే సూర్య కుమారి తన కుమార్తె డయానా శాంతి కోసం ఆర్థిక సహాయం కోరుతూ ఒక అర్జీ ఇచ్చారని, వెంటనే స్పందించి పాప ఆరోగ్య కోసం హామీ ఇవ్వడం జరిగిందని, ముఖ్యమంత్రి చొరవతో తదుపరి వైద్య పరీక్షలు అనంతరం ఎయిమ్స్ వారు రూ . 14 నుంచి రూ.16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ ఉచితంగా అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం నిడదవోలు పర్యటన సందర్భంగా డయానా శాంతి ఆరోగ్యం పై సిఎం వాకబు చేశారు. ఈ సందర్భంలో పాప తల్లితండ్రులు సిఎం ను కలవడం జరిగిందని మాధవీలత తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కే.మాధవీలత ముఖ్యమంత్రి గారికి గత 8 నెలల కాలంలో పాప డయానా శాంతి కి అందించిన వైద్య పరీక్షల వివరాలు తెలియ చేశారు. తమ ఆదేశాల మేరకు, మీరు ఇచ్చిన భరోసా మేరకు పాప తల్లితండ్రులకు జిల్లా యంత్రాంగం అండగా నిలిచి మెరుగైన వైద్యం అందించడానికి చొరవ చూపడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఖర్చుతో ప్రాథమిక పరీక్ష, రక్త నమూనా కోసం శిశువు 6 సార్లు ఢిల్లీ కి పంపి, జెనెటిక్స్ పరీక్ష కోసం ఈ రక్త నమూనా లను నోవాటిస్ కంపెనీ సింగపూర్ మరియు అమెరికాకు పంపడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలన్నింటికీ శిశువుకు సానుకూల ఫలితాలు వచ్చాయని, ఈ క్రమంలో ఎయిమ్స్ ఉంచితంగా ఇంజెక్షన్ అందజేసేందుకు సంసిద్ధత వ్యక్తం చెయ్యడం జరిగిందనీ తెలిపారు. జన్యు చికిత్స నిమిత్తం అయ్యే ఖర్చులు, ఢిల్లీ కి రాను పోను విమాన ప్రయాణ ఖర్చులు, ఆంధ్రా భవన్ లో బస తదితర ఖర్చు లను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పూర్తి ఆర్థిక సహాయాన్ని అందచేశామని కలెక్టర్ వివరించారు. ముఖ్యమంత్రి ఔదార్యం తో రూ.16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ అందచేసే దిశగా ఎయిమ్స్ వారితో సంప్రదింపులు జరిపి సాకారం అయినట్లు పేర్కొన్నారు. మూడు వారాల్లో పాపకు ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం ఉందని తెలియచేశారు. వివరాల లోకి వెళితే..... డయానా శాంతి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ టైప్-2 వ్యాధి చికిత్స పై ప్రతిస్పందిస్తూ, ముఖ్యమంత్రి తక్షణ ఆర్థిక సహాయం గా రూ. లక్ష అందించడం తో పాటు, ప్రతి నెలా రూ.5 వేల వైఎస్ఆర్ నవశకం ఆరోగ్య పింఛను పథకం కింద పెన్షన్ సౌకర్యం వర్తింప చేశారు. పాప తల్లి శ్రీమతి చెట్టే సూర్య కుమారి నిడదవోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా నియామకం చేశామన్నారు. పాపకు మెరుగైన వైద్యం కోసం జనవరి 16 న న్యూ ఢిల్లీ ఎయిమ్స్ కి వైద్యునితో పాటు పంపడం జరిగిందన్నారు. ప్రాథమిక పరీక్షలు మరియు మూల్యాంకనం చేసిన తర్వాత, ఎయిమ్స్ వైద్యులు డయానా శాంతి ఆమె వ్యాధిని అరుదైన వ్యాధి ఎస్ఎంఎ టైప్-2గా నిర్ధారించడం జరిగింది. వైద్య పరీక్షలు, చికిత్స కోసం డయానా శాంతి న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ లో 15 రోజుల పాటు చైల్డ్ హుడ్ న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్స్ విభాగంలో, ఐ టి జీన్ థెరపీ చికిత్స కింద వచ్చే ప్రయోగశాల పరిశోధనలు మరియు శారీరక పరీక్షలు చేయ్యాడం జరిగింది. ముఖ్యమంత్రి చొరవ, జిల్లా కలెక్టర్ సకాలంలో స్పందించడం ని నోవర్టిస్ ద్వారా ఉచితంగా అందించబడిన ఐ టి జీన్ థెరపీ చికిత్స కోసం డయానా శాంతి కి సుమారుగా రూ. 14 నుండి 16 కోట్లు వ్యయం అయ్యే చికిత్స కు ఎయిమ్స్ వారు ముందుకు రావడం పాప వైద్యం సాకారం కాబోతోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సకాలంలో స్పందించడం, తగిన వైద్య చికిత్స, ఆర్థిక సహాయంఉపాధి అవకాశాలను అందచేసి ఆదుకోవడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఔదార్యం కి ఇటువంటి ఘటనలు ప్రత్యక్ష నిదర్శనం.