‘యాస్‌ తుపాన్‌’ ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉన్నాం

వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్రమంత్రి అమిత్‌ షాతో సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: యాస్‌ తుపాన్‌ కదలికలను పరిశీలిస్తే.. ఏపీపై స్వల్ప ప్రభావం ఉండే అవకాశాలున్నాయని, పరిస్థితులను అంచనా వేసుకొని ముందుకుసాగుతామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తుపాన్‌ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడారు. యాస్‌ తుపాన్‌ హెచ్చరికల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. యాస్‌ తుపాన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. 
 

Back to Top