మనకు మండలి అవసరమా?

ఎంతో మంది విద్యావేత్తలు మనకు శాసన సభలో ఉన్నారు

మండలి కొనసాగింపుపై చర్చించి నిర్ణయం తీసుకుందాం

శాసన సభలో 86 శాతం మార్కులు వచ్చాయి

ఇది నిజంగా ప్రజల సభ

గ్యాలరీలో ఉండి మండలిని చంద్రబాబు నడిపించిన తీరు బాధాకరం

మండలి ప్రజల కోసం నడుస్తోందా? ఓడిపోయిన నాయకుల కోసం నడుస్తుందా? 

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

అసెంబ్లీ: ఆర్థిక లోటుతో ఉన్న పేద రాష్ట్రంలో శాసన మండలి కొనసాగించడం అవసరమా అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ కూర్చున్న పరిపాలన సాగించవచ్చు అని పేర్కొన్నారు. ఒక తీర్మానం చేస్తే..ఏ చట్టమూ, ఏ బిల్లు అవసరమే లేదన్నారు. గురువారం సీఎం వైయస్‌ జగన్‌ కీలకమైన పలు ప్రశ్నలను సభ ముందుంచారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 175 స్థానాలకు గాను 2019 ఎన్నికల్లో  151 మంది ఎమ్మెల్యేలతో సభలో అడుగుపెట్టాం. 86 శాతంతో అంటే ఇది నిజంగా ప్రజల సభ.ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం. పాలకులం కాదు..సేవకుల్లా ఉంటామని చెప్పినట్లుగా నడుచుకుంటున్నాం. చట్టాలను చేయడానికి సభ ఏర్పాటైంది. మండలిలో జరిగిన పరిణామాలు నన్ను బాధించాయి. ప్రజా సంక్షేమం కోసం అనేక బిల్లులను చట్టసభలకు తెచ్చాం. 7 నెలలుగా ప్రజల కోసమే పని చేస్తున్నాం. చట్టాలు చేయడానికే ఈ సభ ఏర్పాటైంది. 5 కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ మండలిలో జరిగిన తంతు మనమంతా గమనించాలి. చట్టాలను ఉల్లంఘిస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుంది. మండలి చట్టబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మాం. మండలి నుంచి సలహాలు, సూచనలు వస్తాయి లేదా బిల్లును తిప్పి పంపిస్తారనుకున్నాం. నిబంధనల ప్రకారం సెలెక్ట్‌ కమిటీకి పంపే అధికారం లేదని చైర్మన్‌ చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా సెలెక్ట్‌ కమిటీకి పంపించారు. గ్యాలరీలో ఉండి మండలిని చంద్రబాబు నడిపించిన తీరు బాధ కలుగుతోంది.చంద్రబాబు ఏరకంగా వ్యవహరించారో ప్రజలందరూ చూడాలి. బిల్లును ఆమోదించొచ్చు, లేకపోవొచ్చు, లేదా సవరణలు చేయొచ్చు. కానీ అవేమీ కాకుండా సెలెక్ట్‌ కమిటీ అంటూ చైర్మన్‌ తెరపైకి తీసుకొచ్చారు. తనకున్న విచక్షణాధికారాన్ని చట్టాన్ని ఉల్లంఘించేందుకు వాడనని చైర్మనే చెబుతున్నారు. చంద్రబాబు తనకున్న సంబంధం లేని గ్యాలరీలో కూర్చొని ఆదేశాలు ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యంలో సమంజసమేనా అని అందరూ ఆలోచించాలి. మండలి ప్రజల కోసం నడుస్తోందా? ఓడిపోయిన నాయకుల కోసం నడుస్తుందా? అని ఆలోచించాలి. చైర్మన్‌ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా?. ఇది ప్రజాస్వామ్యంలో సమంజసమేనా అని అందరూ ఆలోచించాలి. బిల్లు పెట్టిన 12 గంటల్లోపే సవరణలు ఇవ్వాలని చైర్మన్‌ చెప్పారు.  సెలెక్టర్‌ కమిటీకి పంపించాలంటే మంత్రులతో బీజేపీ, పీడీఎఫ్‌, వామపక్ష సభ్యులు ఏకీభవించారని చైర్మన్‌ చెప్పారు. మండలి నుంచి సలహాలు, సూచనలు వస్తాయి. లేదా బిల్లును తిప్పి పంపిస్తారనుకున్నాం. లేని అధికారాన్ని ఉపయోగించి సెలెక్ట్‌ కమిటీకి పంపించారు. బిల్లు పెట్టిన 12 గంటల్లోపే సవరణ ఇవ్వాలని చైర్మన్‌ చెప్పారు. చైర్మన్‌ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా?. తప్పు జరిగిందని చైర్మన్‌ చెబుతున్నారు. చంద్రబాబు మాత్రం కార్యకర్తలతో పూలదండలు వేయించుకుంటున్నారు. దాన్ని ఎల్లోమీడియా ప్రచారం చేస్తోంది. రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదు.  అభివృద్ధి కోసం వికేంద్రీకరణ చేయవచ్చు. హుద్‌హుద్‌ తుపాన్‌ వచ్చినప్పుడు  చంద్రబాబు విశాఖ నుంచి పరిపాలించలేదా? జయలలిత ఊటీ నుంచి ప్రభుత్వాన్ని నడిపించలేదా?. మనం ఎక్కడ కూర్చుని ఉన్నా పరిపాలన సాగించవచ్చు. ఒక తీర్మానం చేస్తే..ఏ చట్టమూ, ఏ బిల్లు అవసరమే లేదు. ఆర్టికల్‌ 174 ప్రకారం ఎక్కడి నుంచైనా చట్టాలు చేయవచ్చు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది.
దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే  కేవలం ఆరు రాష్ట్రాల్లోనే మండళ్లు ఉన్నాయి. విభజనతో ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రానికి శాసన మండలి అవసరమా అని ఆలోచించాలి. మండలి కోసం ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, డాక్టర్లు, ఇంజినీర్లు, టీచర్లు, రైతులు ఇలా అన్ని వర్గాల మేధావులు ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో మండలి కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై చర్చ జరగాలి. స్పీకర్‌ అనుమతించి సోమవారం మళ్లీ అసెంబ్లీ పెట్టండి.

Back to Top