విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నంలోని చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠం చేరుకున్నారు. శారదాపీఠం వార్షిక మహోత్సవ ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన సీఎం వైయస్ జగన్‌కు పూర్ణకుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్న అనంతరం.. స్వామీజీలు స్వరూపానందేంద్ర, స్వాత్మానందరేంద్రతో కలిసి పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారికి సీఎం వైయస్ జగన్ పూజలు చేస్తారు.
అనంతరం గోమాతకు నైవేద్యం సమర్పించి జమ్మిచెట్టు ప్రదక్షిణ చేస్తారు. ఆగమయాగశాలలో ఐదు రోజులుగా జరుగుతునన శ్రీనివాస చతుర్వేద హవనం, విశ్వశాంతి హోమాలను సందర్శిస్తారు. మహాపూర్ణాహుతిలో పాల్గొంటారు. పీఠంలో నూతనంగా నిర్మించిన స్వయం జ్యోతి మండపాన్ని ప్రారంభిస్తారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానంలో ముద్రించిన తత్త్వమసి గ్రంథాన్ని సీఎం వైయస్ జగన్ స్వీకరించారు. శ్రౌత మహాసభలో ఉత్తమ పండితునికి సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా స్వర్ణకంకణ ధారణ ఉంటుంది.