గ్రామ‌/వార్డు స‌చివాల‌యాల ద్వారా ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను డోర్ డెలివ‌రీ చేస్తున్నాం

- అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

అధికారంలోకి వ‌చ్చిన నాలుగు నెల‌ల్లోనే ఇంచుమించు 15 వేల గ్రామ వార్డు స‌చివాల‌యాల్లో ల‌క్షా 26వేల 728 మంది ఉద్యోగాలు పొందారు. దాదాపు వారం రోజులు నిష్ఫాక్షికంగా ఉద్యోగాలు నిర్వ‌హించిన మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డితోపాటు ఉద్యోగుల‌ను మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నా. 51శాతం మంది బీసీల‌కు ఉద్యోగాలు ల‌భించాయి. బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీల‌ను క‌లుపుకుంటే 81%మందికి ఉద్యోగాలు సాధించారు. దీంతోపాటు 2.5 ల‌క్ష‌ల‌కుపైగా వాలంటీర్ల‌ను నియ‌మించాం. స‌త్వ‌రం సేవ‌లందిస్తున్నాం. ఎలాంటి అవినీతి లేకుండా ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను డోర్ డెలివ‌రీ చేస్తున్నాం. అర్హులైన ప్ర‌తి ల‌బ్ధిదారుడికీ న్యాయం చేస్తున్నాం. రెండువేలు జ‌నాభా ఉన్న ప్ర‌తి గ్రామంలో ఒక స‌చివాల‌యాన్ని ఏర్పాటు చేశాం. స‌చివాల‌యంలోనే ల‌బ్ధిదారుల జాబితాను ప్ర‌ద‌ర్శిస్తున్నాం. మొత్తం 500 ర‌కాల ప‌నుల‌ను గ్రామ స‌చివాల‌య‌ల ద్వారా ప్ర‌జ‌ల‌కు చేసి పెడుతున్నాం. ప్ర‌తి సోమ‌వారం స్పంద‌న కార్య‌క్ర‌మం ప్ర‌తి గ్రామ స‌చివాల‌యంలో జ‌రుగుతుంటే.. స‌చివాల‌యంలో మాత్రం రోజూ జ‌రుగుతుంది. ప్ర‌జా సమ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే వేదిక‌గా గ్రామ స‌చివాల‌యాలు ఆద‌ర్శంగా నిలుస్తున్నాయి. గ్రామ సచివాల‌యం వంటి ఒక మంచి కార్య‌క్ర‌మంపై సుదీర్ఘంగా చ‌ర్చ జ‌రుగుతున్నాచంద్రబాబు ఇక్క‌డ లేక‌పోవ‌డం బాధ‌గా ఉంది. ఆయ‌న ఇక్క‌డే ఉండి ఉంటే ఎంతో జ్క్షానాన్ని ఆర్జింంచేవారు. 

Read Also:కులమతాలకు అతీతంగా వైయస్‌ జగన్‌ పాలన 

Back to Top