కులమతాలకు అతీతంగా వైయస్‌ జగన్‌ పాలన

సహసోపేతమైన నిర్ణయాలతో ప్రజలకు చేరువ

ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు

అసెంబ్లీ: సహసోపేతమైన నిర్ణయాలతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రజలకు చేరువయ్యారని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. కులమతాలకు అతీతంగా వైయస్‌ జగన్‌ పాలన అందిస్తున్నారు.  గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దుతూ ముందుకు సాగుతున్నారన్ని చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ..ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్నారు. ఆర్థిక సంక్షోభం ఉన్న రాష్ట్రంలో ఆరు నెలల్లోనే ఎన్నికల హామీలను అమలు చేశారు. వంద రోజుల్లో మడమ తిప్పకుండా హామీలు నెరవేర్చారు. గ్రామ వాలంటీర్‌ వ్యవస్థను ఆగస్టు 15న ప్రారంభించారు. అవినీతిరహిత పాలన అందిస్తున్నారు. దాదాపు రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 32 శాఖల సేవలను ప్రజలకు అందజేస్తున్నారు. ఇటీవల చెన్నై వెళ్తే అక్కడి నేత స్టాలిన్‌ను కలిశాను. ఆయన మన ముఖ్యమంత్రి గురించి, నవరాత్నాల గురించి ఆరా తీశారు. చాలా గర్వంగా ఉంది. అక్టోబర్‌ 3న, 2019లో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఓ కథనం వచ్చింది. బిక్షాటన చేసే వ్యక్తి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని ఓ కథనం ఆ పత్రిక రాసింది. ప్రతి విద్యార్థి మనకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉన్నారు. ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగ క్యాలండర్‌ ఇస్తున్నారు. ఇలాంటి పాలన దేశంలో ఎక్కడా చూడలేదు. ఇలాంటి సహాసోపేత నిర్ణయాలు తీసుకోవాలంటే ధైర్యం ఉండాలి. ప్రజలకు మేలు చేయాలంటే మంచి మనసు ఉండాలి. అలాంటి మనసు మన సీఎంకు ఉంది. పింఛన్ల పంపిణీ మొదలు అమ్మ ఒడి ప్రయోజనాలు, రైతు భరోసా, ఆర్థికసాయం పంపిణీ, వివిధ పథకాలు చేరువ చేసే కార్యక్రమాలు గ్రామ వాలంటీర్ల ద్వారా చేపడుతున్నాం. ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇటీవల చాలా చోట్ల వైయస్‌ జగన్‌ కులం, మతం గురించి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. కులాలు, మతాలకు అతీతంగా పాలన సాగిస్తున్నారు. 

Read Also: గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం

Back to Top