గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం

ఎమ్మెల్యే గుడివాడ  అమర్‌నాథ్‌
 

అసెంబ్లీ: మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శమని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వం చేరువైందన్నారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు.  సీఎం వైయస్‌ జగన్‌ ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. దాదాపు వందేళ్ల పాటు మన దేశం కోసం పోరాటం చేసిన ఎంతో మంది మహనీయులు, ముఖ్యంగా మహాత్మాగాంధీ అనేవారు..పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్న మాటలు గుర్తు చేసుకుంటూ..దేశంలో అనేక రాజకీయ పార్టీలు వందలాది మంది గొప్ప నాయకులు ఉన్న ఈ దేశంలో ఏ నాయకుడు తీసుకొని నిర్ణయాన్ని..గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చారు. వైయస్‌ జగన్‌ 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ప్రతి మండలంలో ఆయన పాదయాత్ర కొనసాగింది. ఆయనకు ఎదురైన అనేక సమస్యలు, ప్రజల కష్టాలు, గ్రామ స్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో మన రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు. సామాన్యుడు తన కష్టాన్ని ప్రభుత్వానికి చెప్పుకునే సమయం వచ్చినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం. ఈ రోజు అనేక పంచాయతీలు ఉన్నాయి. సాధారణంగా ఓ వ్యక్తికి, కుటుంబానికి ఇబ్బందులు వస్తే అధికారులకు చెప్పుకుందామంటే ఎవరు అందుబాటులో లేని తరుణంలో ఇలాంటి పరిస్థితులను మార్పు చేస్తే గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2 వేల జనాభా ఉన్న ప్రతి పంచాయతీని గ్రామ సచివాలయంగా ఏర్పాటు చేయడం అదృష్టం. ప్రతిపక్ష నాయకులు సచివాలయ వ్యవస్థకు అనుకూలమో? వ్యతిరేకమో చెప్పాల్సిన అవసరం ఉంది. గ్రామ సచివాలయంలో అన్ని శాఖలు ఉంటాయి. ఏదైనా సమస్య వస్తే ఇక్కడ పరిష్కారం దొరుకుతుందన్న అవకాశం కల్పించారు. ఇది దేశానికే ఆదర్శం. ఈ వ్యవస్థ ద్వారా ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలను తీసుకెళ్తున్నాం. 
గ్రామ వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా దాదాపు 500 సమస్యలకు పరిష్కారం చూపుతున్నాం. గ్రామ సచివాలయాల్లో 14 మంది శాశ్వత ఉద్యోగులను ఏర్పాటు చేశాం. గ్రామాల్లో ఏదైనా ఇబ్బంది వస్తే ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు అందుబాటులో ఉన్నారు. ప్రతి సచివాలయంలో మహిళల రక్షణకు సీఎం వైయస్‌ జగన్‌ ముందే ఆలోచన చేశారు. పూర్వం మండల వ్యవస్థ, తాలుకా వ్యవస్థల్లో జరిగిన పరిస్థితులను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఏదైనా ఇబ్బంది వస్తే సచివాలయంలో 72 గంటల్లో సమస్యలకు పరిష్కారం చూపుతున్నాం. రాష్ట్రంలో 1.34 లక్షల మందికి సచివాలయాల్లో ఉద్యోగాలు ఇ‌చ్చాం. గ్రామ వాలంటీర్లుగా దాదాపు రెండున్నర లక్షల మందికి ఉద్యోగ అవకాశం కల్పించిన ప్రభుత్వం మనదని గర్వపడుతున్నాను. గతంలో చంద్రబాబు పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ పేరుతో వేల కోట్ల తీసుకువస్తున్నామని చెప్పి మోసం చేశారు. గతంలో వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాలు అన్నీ కూడా తానే తెచ్చినట్లు చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. 

Read Also: గాంధీజీ కలలు సీఎం వైయస్‌ జగన్‌ నెరవేర్చారు

Back to Top