గాంధీజీ కలలు సీఎం వైయస్‌ జగన్‌ నెరవేర్చారు

అవినీతికి తావులేకుండా గ్రామ సచివాలయాల ద్వారా పరిపాలన

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

 

అసెంబ్లీ: మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారని, దేశంలోనే మొట్టమొదటి సారిగా గ్రామ సచివాలయ వ్యవస్థ ఏపీలో ఏర్పాటయిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి అన్ని శాఖల అధికారులను ఒక్కచోటకు చేర్చారన్నారు. ప్రజల సమస్యలను 72 గంటల్లో గ్రామ సచివాలయాలు పరిష్కరిస్తున్నాయని వివరించారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పేరిట ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు చేసిన పాదయాత్రలో ప్రజల కష్టాలన్నీ తెలుసుకున్నారని, ప్రజలు చెప్పే బాధలు వింటూ చిన్న చిన్న పనుల కోసం వారు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయారని, అప్పుడే గ్రామ సచివాలయ వ్యవస్థ శ్రీకారం చుట్టుకుందన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పరిపాలనను గ్రామాలకు చేర్చి 34 విభాగాలకు సంబంధించిన 500 సేవలను అవినీతికి తావులేకుండా ప్రజలకు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని చెవిరెడ్డి అన్నారు.  

చంద్రబాబు పాలనలో ఆంధ్రరాష్ట్రం బీహార్‌ కంటే అధ్వాన్నంగా తయారైందని లేబర్‌ ఫోర్స్‌ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైందని ఎమ్మెల్యే చెవిరెడ్డి చెప్పారు. అదే విధంగా జాతీయ కుటుంబ సర్వే 2005, 2016లో చేశారని, 2005లో సర్వేలో దేశ సగటుకన్నా నిరుద్యోగ సమస్య 0.8 శాతం అధికంగా ఉంటే 2016 చంద్రబాబు హయాంలో చేసిన సర్వేలో అది 3.09కి చేరిందన్నారు. నిరుద్యోగ సమస్యను పెంచిన మహానుభావుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. చదువు, సంధ్య లేని దోపిడీ దొంగలకు జన్మభూమి కమిటీల పేరుతో ఉద్యోగాలు ఇచ్చి గ్రామాల్లో వ్యవస్థలను సర్వనాశనం చేశాడని మండిపడ్డారు.  

సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలనలో నా పిల్లలు ప్రయోజకులు అవుతున్నారని, కళ్ల ముందే ఉద్యోగాలు చేసుకుంటున్నారని ప్రతీ తల్లిదండ్రి ఆనందంగా ఉన్నారన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా చదువుకున్న యువతీ యువకులకు దాదాపు 4 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దన్నారు. దీంట్లో సుమారు లక్ష మంది బీసీలు, 64 వేల మంది ఎస్సీ, ఎస్టీలు ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. అదే విధంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో మొదటి రోజుల్లో సుమారు 2 నుంచి 3 వందల అర్జీలు వచ్చేవని, కానీ ప్రస్తుతం వాటి సంఖ్య 70కి చేరిందన్నారు. మరో ఆరు నెలలు గడిచిన తరువాత స్పందనకు అర్జీ ఇచ్చే వ్యక్తే లేకుండా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.

Read Also: 94 శాతం అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేశాం

Back to Top